శాంతిభద్రతల పరిరక్షణకే ప్లాగ్‌మార్చ్
కొత్తకోట రూరల్: శాంతిభద్రతల పరిరక్షణకే గ్రామాల్లో ప్లాగ్‌మార్చ్ నిర్వహిస్తున్నట్లు సీఐ రాంబాబు తెలిపారు. ఎస్పీ డి.సునీతరెడ్డి ఆదేశానుసారం గురువారం పెద్దమందడి మండలం వెల్టూర్‌లో సీఐ, ఎస్‌ఐ శివకుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది గ్రామంలోని ప్రధాన వీధుల్లో కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. మండలంలోని అన్ని గ్రామాల్లో మొదటి విడత ఎన్నికలు జరిగే సమయం సమీపిస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురికాకుండా తమ ఓటుహక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు, ప్రజలకు అండగా ఉంటామని ధైర్యం చెప్పడానికి కవాతు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అంతకుముందు ఎస్‌ఐ మాట్లాడుతూ.. గ్రామాల్లో అల్లర్లు సృష్టించినా, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తితే ఘటనా స్థలానికి స్థానిక పోలీసులతో పాటు జిల్లాకేంద్రం నుంచి అదనపు బలగాలు చేరుకుంటాయని తెలిపారు. ప్లాగ్‌మార్చ్‌లో ఏఎస్‌ఐ ముత్యాలు, హెడ్ కానిస్టేబుల్ ఆవులయ్య, శ్రీనివాసులు, కానిస్టేబుళ్లు వెంకటేశ్వర్‌రెడ్డి, ఎస్.రాకేష్, నరేష్, ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు.


