ఎన్నికల సిబ్బందికి శిక్షణ
వనపర్తి రూరల్: జిల్లాకేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాల, పెబ్బేరులోని బాలుర ఉన్నత పాఠశాలలో గురువారం ఎన్నికల సిబ్బందికి ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జనరల్ అబ్జర్వర్, వ్యయ పరిశీలకుడు పాల్గొని ఎన్నికల నియమావళిపై అవగాహన కల్పించారు. జిల్లాకేంద్రంలోని జరిగిన శిక్షణకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య హాజరై సలహాలు, సూచనలిచ్చారు. పోలింగ్, కౌంటింగ్ సమయంలో తలెత్తే కీలక అంశాలను క్షుణ్ణంగా వివరించారు. డిప్యూటీ సీఈఓ రాంమహేశ్వర్‌రెడ్డి, ఆయా మండలాల ఎంపీడీఓలు రవీంద్రబాబు, వెంకటేష్, సీఎంఓ ప్రతాప్‌రెడ్డి, ఎంఈఓ జయరాములు, ఎంపీఓలు, జూనియర్ అసిస్టెంట్ భరత్‌గౌడ్ పాల్గొన్నారు.


