వివరాలు నమోదు చేస్తున్నాం..
ఎకరాకు 9 క్వింటాళ్లకు మించి పత్తి పండించిన రైతులు పట్టాదారు పాసు పుస్తకాలు తీసుకొని వస్తున్నారు. రైతు ఇచ్చిన వివరాలు తీసుకొని నేరుగా పొలానికి వెళ్లి దిగుబడి వచ్చిందా లేదా అని తెలుసుకొని ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేస్తున్నాం
– అరవింద్, ఏఓ, అమరచింత
దళారులకు అమ్ముకోలేక..
పది ఎకరాల్లో పత్తి సాగు చేశా. ప్రస్తుతం ఎకరాకు 11 క్వింటాళ్ల నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. సీసీఐ ద్వారా ఎకరాకు 7 క్వింటాళ్లు మాత్రమే కొంటామన్నారు. తక్కువ ధరకు దళారులకు అమ్ముకోలేక నిల్వ ఉంచా. ప్రస్తుతం సీసీఐ ద్వారా 12 క్వింటాళ్లు కొంటామని చెప్పడం ఆనందంగా ఉంది.
– విష్ణువర్ధన్‌యాదవ్, అమరచింత
కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో..
పత్తి రైతుల ఇబ్బందులను గుర్తించిన కేంద్రం సీసీఐ కేంద్రాల ద్వారా 12 క్వింటాళ్ల పత్తి కొనుగోలుకు అనుమతినిచ్చింది. జిల్లాలోని పత్తి రైతులకు ఈ విషయాన్ని సంబంధిత ఏఈఓల ద్వారా తెలియపరుస్తూ పంట దిగుబడి వివరాలు సేకరించి ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నాం. పత్తి రైతులు దళారులను ఆశ్రయించి నష్టపోకుండా సీసీఐ కేంద్రాల్లో విక్రయించుకునే అవకాశం కల్పిస్తున్నాం. – దామోదర్, ఏడీఏ
వివరాలు నమోదు చేస్తున్నాం..
వివరాలు నమోదు చేస్తున్నాం..


