ఎన్నికల నిర్వహణలో పీఓల పాత్ర కీలకం
మధనాపురం: ఎన్నికల నిర్వహణలో ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారుల పాత్ర కీలకమని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. సోమవారం మదనాపురం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పీఓల శిక్షణ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. పీఓలు, ఏపీఓలు తమ విధులు, బాధ్యతలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎన్నికల నిబంధనలు పక్కాగా పాటిస్తూ పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని సూచించారు. ఎన్నికల నిర్వహణలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించొద్దని అన్నారు. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ మోహన్ తదితరులు ఉన్నారు.


