సైన్స్ ఫెయిర్‌తో శాసీ్త్రయ దృక్పథం పెంపు
వనపర్తి రూరల్: చిట్యాల ఎంజేపీ గురుకుల పాఠశాలలో మూడురోజుల పాటు నిర్వహించిన జిల్లా స్థాయి విద్య, వైజ్ఞానిక ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ పాఠశాలల విద్యార్థులు 270 ప్రాజెక్టులు, ఇన్‌స్పైర్ మనక్ కింద 124 ప్రాజెక్టులు ప్రదర్శించారు. సుిస్థిర వ్యవసాయం, వ్యర్థాల నిర్వహణ, పునరుత్పాదక శక్తి, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక తదితర అంశాలతో జూనియర్, సీనియర్ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. డీఈఓ అబ్దుల్‌ఘని, డీఎస్‌ఓ శ్రీనివాసులు పోటీలను పర్యవేక్షించిన వారు మాట్లాడుతూ.. ఈ ప్రయోగాలను న్యాయ నిర్ణేతలు క్షణంగా పరిశీలించి ప్రథమ స్థానంలో జూనియర్ విభాగంలో 7, సీనియర్ విభాగంలో 7 ప్రాజెక్టులు, ఇన్‌స్పేర్ మనక్ కింద 12 ప్రాజెక్టులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాయని ఆయన తెలిపారు. ఆదివారం నిర్వహించిన ముగింపు కార్యక్రమానికి డీఎస్‌ఓ శ్రీనివాసులు విజేతలకు షీల్డ్, ప్రశంసాపత్రాలు అందజేశారు. పెబ్బేరు మండలంలోని వై.శాఖాపూర్ జెడ్పీ పాఠశాల గైడ్ టీచర్ కె రాంచందర్ పర్యవేక్షణలో 8వ తరగతి విద్యార్థులు జె హర్షిత, పి.హర్షిత సేవ్ లైఫ్ –ఫ్రం మ్యాన్‌హోల్ ప్రాజెక్టు రాష్ట్రస్థాయికి ఎంపికై ంది. జిల్లా కేంద్రంలోని మైనార్టీ బాలికల జూనియర్ కళాశాల గైడ్ లెక్చరర్ శివగంగ పర్యవేక్షణలో ప్రేమలత, ఇఫ్రా ఫస్ట్ ఇయర్ బైపీసీ, విద్యార్థులు వ్యర్థ పదార్థాలు ప్రకృతికి హానిపై మొదటిస్థానంలో నిలిచి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ప్రశాంతి, జీసీడీఓ శుభలక్ష్మి, ఎంఈఓ మద్దిలేటి, సీఎంఓ ప్రతాప్‌రెడ్డి, మహానంది, మీడి యా కన్వీనర్లు గిరిరాజాచారి, విజయకుమార్, బైరోజు చంద్రశేఖర్, సుజాత పాల్గొన్నారు.


