చదరంగం ఆటతో మెదడుకు వ్యాయాయం
వనపర్తి టౌన్: చదరంగం ఆట మెదడుకు వ్యాయామమని, సమస్యల పరిష్కార సామర్థ్యాలను పెంచుతుందని జిల్లా చెస్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ మురళీధర్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో చాంపియన్‌షిప్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెస్ కేవలం ఆట మాత్రమే కాదని, జీవితంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో నేర్పే జీవిత గురువు అని తెలిపారు. విద్యార్థులు ఎక్కువగా చెస్ ఆడాలని, తద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందుతుందని, జీవితంలో ఎలాంటి నిర్ణయాలను ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో తీసుకుంటారని చెప్పారు. అబ్బాయిల విభాగంలో చాపింయన్‌గా ధృవ తోట, ఫస్ట్ రన్నరప్‌గా యోహాన్ యాదవ్ తరల, తిజిల్ సింగ్, అఖిల్ రాపల్లె, మోక్షిత్ పలుసులేటి, లెల్లా దేవాన్ష్, అల్లాది శ్రీవత్సన్, అమ్మాయిల విభాగంలో చాంపియన్‌గా యశస్వి జైన్, రన్నరప్‌గా సాహ్జేదీప్ కౌర, సవిత విజ్జి, శశి హాసిని చింతల, మహాదేవ్ నిషిత హౌజ్, జాన్వి తోటలు విజేతలుగా నిలిచారు. అమ్మాయిల విభాగంలో ఆరుగురు, అబ్బాయిల విభాగంలో ఏడుగురు కలిపి 13 మంది విజేతలుగా నిలిచారని, గెలుపొందిన వారు నేషనల్ లెవల్ పోటీపడతారని పేర్కొన్నారు. అంతకుముందు విజేతలకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి వేణుగోపాల్, కోశాధికారి టీపీ కృష్ణయ్య, అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


