‘నామినేషన్ల స్వీకరణలో పొరపాట్లు జరగొద్దు’
వనపర్తి/ఆత్మకూర్/మదనాపురం: సర్పంచ్ ఎన్నికల నామినేషన్ స్వీకరణ కేంద్రాల్లోకి ముగ్గురి కంటే ఎక్కువ మందిని అనుమతించొద్దని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. ఆదివారం ఉదయం నుంచి వనపర్తి, కొత్తకోట, మదనాపూర్, ఆత్మకూర్, అమరచింత మండలాల్లో రెండో విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం అయింది. ఈ నేపథ్యంలో కలెక్టర్ వనపర్తి మండలంలోని రాజపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో, మదనాపురం రైతువేదికలో, ఆత్మకూర్ మండలంలోని పిన్నంచర్ల పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ స్వీకరణ ప్రక్రియ ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చూడాలని రిటర్నింగ్ అధికారులకు సూచించారు. ప్రతిరోజు నామినేషన్లను స్వీకరించిన అనంతరం సాయంత్రం టీ పోల్ యాప్‌లో అప్‌డేట్ చేయాలన్నారు.


