● తొలిరోజు సర్పంచ్‌స్థానాలకు 75.. వార్డు స్థానాలకు 26 దాఖలు
● అత్యధికంగా ఖిల్లాఘనపురంలో 28 నామినేషన్లు
వనపర్తి: గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కావడంతో పల్లెల్లో కోలాహలం మొదలైంది. మొదటి విడత జిల్లాలోని ఖిల్లాఘనపురం, పెద్దమందడి, గోపాల్‌పేట, రేవల్లి, ఏదుల పరిఽధిలోని 87 సర్పంచులు, 780 వార్డుసభ్యుల స్థానాలకు గురువారం అధికారులు నోటిఫికేషన్ విడుదల చేసి నామినేషన్ల స్వీకరణ ప్రారంభించారు. తొలిరోజు నామినేషన్ల దాఖలు మొక్కుబడిగానే సాగింది. అత్యధికంగా ఖిల్లాఘనపురం మండలంలో 29 గ్రామపంచాయతీలకుగాను సర్పంచ్ స్థానాలకు 28 నామినేషన్లు దాఖలయ్యాయి. మండలంలోని మామిడిమాడలోనే.. ఏడు నామినేషన్లు రావడం గమనార్హం.
● తొలిరోజు ఐదు మండలాల పరిధిలో సర్పంచ్ స్థానాలకు 75, వార్డు సభ్యుల స్థానాలకు 26 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా అదనపు ఎన్నికల అధికారి వెల్లడించారు.
ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ


