తుది ఘట్టానికి ఏర్పాట్లు పూర్తి
వనపర్తి: గ్రామపంచాయతీ ఎన్నికల తుది ఘట్టానికి అఽధికారులు సర్వం సిద్ధం చేశారు. జిల్లాలోని చిన్నంబావి, వీపనగండ్ల, పాన్‌గల్, పెబ్బేరు, శ్రీరంగాపురంలో చివరి విడత ఎన్నికలు జరగనుండగా.. మంగళవారం మండల కేంద్రాల నుంచి పీఓలు, ఓపీఓలు ఎన్నికల సామగ్రితో ఐదు మండలాల పరిధిలోని 702 పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. పోలింగ్ ఉదయం ఏడుకు ప్రారంభమై.. మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగనుంది. మధ్యాహ్న భోజన విరామం అనంతరం స్టేజ్–2 ఆర్‌ఓ ఆధ్వర్యంలో లెక్కింపు ప్రక్రియ ప్రారంభించి ఫలితాలు వెల్లడిస్తారు. తుది విడతలో 87 సర్పంచ్ స్థానాలకుగాను ఏడు ఏకగ్రీవం కాగా.. 80 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే 806 వార్డులకు గాను 104 వార్డు సభ్యులు ఏకగ్రీవం కాగా.. మిగిలిన 702 స్థానాలు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మొత్తం 702 పోలింగ్ కేంద్రాలకు 2,239 మంది పీఓలు, ఓపీఓలను కేటాయించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు 1,300 మంది పోలీసు అధికారులు, సిబ్బంది బందోబస్తు నిర్వహించనున్నారు.
నేడు జిల్లాలోని ఐదు మండలాల్లో
స్థానిక ఎన్నికలు
పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సామగ్రి, సిబ్బంది
విధుల్లో 2,239 మంది సిబ్బంది
బందోబస్తుకు 1,300 మంది పోలీసులు


