సజావుగా ఎన్నికల నిర్వహణ
పాన్‌గల్: గ్రామపంచాయతీ మూడోవిడత ఎన్నికలు సజావుగా జరిగే విధంగా మండలంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రభు త్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని ఆయన సంద ర్శించి ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూ చనలు, సలహాలిచ్చారు. ఎన్నికల సామగ్రి, సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు సకాలంలో చేరేలా తగిన ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఆయన వెంట ఎంపీడీఓ గోవిందరావు, తహసీల్దార్ సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.


