ప్రశాంత వాతావరణంలో స్థానిక ఎన్నికల నిర్వహణ
ఖిల్లాఘనపురం: ప్రశాంత వాతావరణంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా, అభ్యర్థులు నామినేషన్లు వేసేలా చూడాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ అన్నారు. గురువారం మండల కేంద్రంతో పాటు పర్వతాపురం, మామిడిమాడ, సల్కెలాపురం, అప్పారెడ్డిపల్లి తది తర గ్రామాల్లో పర్యటించి నామినేషన్ స్వీకరణ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నామినేషన్ కేంద్రాల్లోకి గుంపులు గుంపులుగా కాకుంగా అభ్యర్థితో పాటు ప్రతిపాదించే వ్యక్తులను మాత్రమే అనుమతించాలన్నారు. పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించాలని, ఎ న్నికల నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని.. అతిక్రమించిన వారిపై చట్టపరంగా చర్యలు ఉంటా యని హెచ్చరించారు. ఆయన వెంట తహసీల్దా ర్ సుగుణ, ఎంపీడీఓ విజయసింహారెడ్డి, ఎస్‌ఐ వెంకటేష్, వివిధ గ్రామాల ఆర్‌ఓలు ఉన్నారు.


