కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ను ప్రజలు నమ్మరు
కొత్తకోట: కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితులో లేరని.. నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. మంగళవారం పట్టణంలో దేవరకద్ర నియోజకవర్గ గ్రామపంచాయతీ ఎన్నికల సన్నాహక సమావేశం బీజేపీ పట్టణ అధ్యక్షుడు వనపర్తి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించగా.. ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బీఆర్‌ఎస్ పార్టీ కుటుంబ అవినీతి పాలన, ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వంటి విషయాలను ప్రజలకు వివరించాలన్నారు. గ్రామపంచాయతీల్లో వీధిదీపాలు మొదలు శ్మశానవాటికల నిర్మాణం వరకు అన్ని అభివృద్ధి పనులకు వెచ్చిస్తున్న మొత్తం నిధులు కేంద్ర ప్రభుత్వానివేనని తెలిపారు. సమావేశంలో బీజేపీ మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, ఉపాధ్యక్షులు కొమ్ము భరత్‌భూషణ్, పార్టీ పార్లమెంట్ ఇన్‌చార్జ్ డోకూర్ పవన్‌కుమార్‌రెడ్డి, పద్మజారెడ్డి, రాజవర్ధన్‌రెడ్డి, కొండా ప్రశాంత్‌రెడ్డి, దాబా శ్రీనివాస్‌రెడ్డి, నవీన్‌రెడ్డి, బాలస్వామి, నర్సింహ, స్టార్ బాలు, అమరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


