నిబంధనల మేరకే ధాన్యం కొనుగోళ్లు
వనపర్తి రూరల్: ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ రైతుల నుంచి వరి ధాన్యం కొనుగోలు చేసి వెంటనే కేటాయించిన రైస్‌మిల్లుకు తరలించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ ఆదేశించారు. మంగళవారం పెబ్బేరు మార్కెట్‌యార్డు, కంచిరావుపల్లిలోని కొనుగోలు కేంద్రాలను, శ్రీరంగాపురం మండల కేంద్రంలోని లక్ష్మి నర్సింహ రైస్‌మిల్, కొనుగోలు కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. ఆయా కేంద్రాల్లో ధాన్యం తేమశాతం పరిశీలించడంతో పాటు రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా బీచుపల్లిలోని సప్తగిరి రైస్‌మిల్, సాయిగోపాల్ రైస్‌మిల్ గోదాంలను పరిశీలించి వానాకాలం సీజన్‌కు సంబంధించిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన వెంటనే దించుకోవాలని మిల్లర్లకు సూచించారు. అదేవిధంగా 2024–25 యాసంగి సీఎంఆర్ బకాయిలు గడువులోగా ఎఫ్‌సీఐకి అప్పగించాలన్నారు. ఆయన వెంట జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కాశీ విశ్వనాథ్, పౌరసరఫరాల సంస్థ డీఎం జగన్మోహన్ తదితరులు ఉన్నారు.


