టెండర్ల ప్రక్రియ పూర్తి..
జూరాల, కొత్తపల్లి మధ్య కృష్ణానదిపై వంతెన నిర్మాణం కోసం రూ.123 కోట్ల నిధులను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించగా.. ఆర్‌అండ్‌బీ శాఖ టెండర్ల ప్రక్రియ పూర్తిచేసింది. పనుల ప్రారంభానికి గాను గత నెల చివరి వారంలోనే భూమిపూజ జరుగుతుందని ప్రచారం జరిగిన ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో వాయిదా పడింది. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భూమిపూజకు ఆదేశాలు ఇవ్వడంతో డిసెంబర్ 1న ముహూర్తం ఖరారు చేయడంతో మంత్రి వాకిటి శ్రీహరి, కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఆయా శాఖల అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.


