సైన్స్‌ల్యాబ్‌లను వినియోగించుకోవాలి
ఖిల్లాఘనపురం: పాఠశాలల్లో ఏర్పాటు చేసిన సైన్స్ ల్యాబ్‌లను వినియోగించుకొని విద్యార్థులు ఉన్నతస్థాయికి ఎదగాలని సీఎంఓ ప్రతాప్, డీఎస్‌ఓ శ్రీనివాసులు అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలను వారు పరిశీలించి సైన్స్ ల్యాబ్ వినియోగంపై విద్యార్థులు, ఉపాధ్యాయులతో ఆరాతీసి పలు సూచనలు చేశారు. మధ్యాహ్న భోజనం కోసం ఉంచిన ఆహార పదార్థాలను పరిశీలించి నమూనాలు తీసుకున్నారు. ప్లంబింగ్, ఐటీ తరగతులను పరిశీలించి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. పాఠశాలలో కొనసాగుతున్న హిందీ కాంప్లెక్స్ సమావేశాన్ని పరిశీలించి హిందీ టీఎల్‌ఎం మెటీరియల్ తయారీపై సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల కోసం ప్రభుత్వం అందిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అన్ని పాఠశాలల్లో టీఎల్‌ఎం తయారు చేసి వినియోగించాలని సూచించారు. వారి వెంట పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కాళిదాసు, సైన్స్ ఉపాధ్యాయులు శ్రీనివాసులు, లక్ష్మారెడ్డి, హీరాలాల్, రఘు, రాముడు, మన్య, లావుడ్యా, ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


