శాంతిభద్రతల పరిరక్షణలో కీలకపాత్ర
జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలులో ఎస్పీ రావుల గిరిధర్ కీలకంగా పని చేశారని కలెక్టర్ ఆదర్శ్ సురభి కొనియాడారు. ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ఎస్పీ బదిలీ వీడ్కోలు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాల్య వివాహాలు, సైబర్ నేరాల నియంత్రణ, ప్రజలకు దగ్గరగా ఉండే పోలీసింగ్‌ను అమలుకు సేవలో సమగ్రత, నిబద్ధతకు కొత్త ప్రమాణాలు నెలకొల్పారన్నారు. జిల్లాకు ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజల సహకారమే శాంతికి సూత్రమని, ఇక్కడికి వచ్చిన నాటి నుంచి ఉద్యోగులందరూ ఓ కుటుంబంలా కలిసిపోయారని చెప్పారు. కార్యక్రమంలో ఎస్పీ సతీమణి బండి అపర్ణ, ఏఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వరరావు, జెడ్పీ మాజీ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


