64 ఎకరాల విస్తీర్ణంలో..
మూడు నెలలు నిల్వ..
మరికొన్ని పదార్థాలు..
పెబ్బేరు మత్స్య కళాశాలలో వినూత్న ప్రయోగాలు
●
ఇప్పటి వరకు ఆవకాయ, నిమ్మకాయ, ఉసిరికాయ, చింతకాయ పచ్చళ్లు చూశాం.. ఇటీవలి కాలంలో చికెన్, మటన్ పచ్చళ్లు కూడా అక్కడక్కడా చూస్తున్నాం.. అయితే ఆంధ్ర ప్రాంతానికి పరిమితమైన చేప, రొయ్య పచ్చళ్లు సైతం అందుబాటులోకి తెచ్చారు వనపర్తి జిల్లా పెబ్బేరులోని మత్స్య కళాశాల విద్యార్థులు. జాతీయ రహదారి–44పై అవుట్ లెట్ ఏర్పాటు చేసి తెలంగాణ చేప పచ్చడి రుచి చూపిస్తున్నారు. ఎంసెట్ అర్హత పరీక్ష రాసి ఫిషరీస్ సైన్స్ కాలేజీలో సీటు సంపాదించుకునే విద్యార్థులకు కోర్సులో ఏడు విభాగాలపై విద్యాభ్యాసం చేయాల్సి ఉంటుంది. అందులో ఒకటైన ఫిష్ ప్రాసెసింగ్ టెక్నాలజీ విభాగంలో చేపతో వివిధ రకాల ఆహార పదార్థాలు తయారు చేయవచ్చనే అంశంపై అభ్యాసం చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే
జలపుష్పాల పచ్చళ్లు తయారు చేస్తూ ఔరా అనిపిస్తున్నారు.
– వనపర్తి
● చేప, రొయ్యల పచ్చళ్ల
తయారీలో ఔరా
అనిపిస్తున్న విద్యార్థులు
● జాతీయ రహదారి–44పై అవుట్ లెట్ ఏర్పాటు చేసి విక్రయాలు
● వచ్చిన రాబడిలో
90 శాతం విద్యార్థుల
సంక్షేమానికి వెచ్చింపు
● ఎంసెట్ ర్యాంకు
ఆధారంగా
ఏటా 28 మందికి అడ్మిషన్లు
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2017 డిసెంబర్‌లో రాష్ట్రంలో తొలిసారిగా వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణంలో మత్స్య కళాశాల ఏర్పాటు చేశారు. మొదట్లో ప్రైవేటు అద్దె భవనంలో కొన్నాళ్లు నిర్వహణ సాగింది. తర్వాత పెబ్బేరు నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే జాతీయ రహదారి–44కి సమీపంలో 64.5 ఎకరాల విస్తీర్ణంలో కళాశాల శాశ్వత భవనాల సముదాయం నిర్మించారు. ప్రస్తుతం శాశ్వత భవనంలోనే కళాశాల కొనసాగుతోంది. రెండు హాస్టళ్లు, ఒక మెస్, ఒక కాలేజీ భవనం మంజూరు కాగా.. కాలేజీ భవన నిర్మాణం తుది దశలో ఉంది. ఏటా 28 మంది విద్యార్థులకు ఎంసెట్ ర్యాంకు ఆధారంగా కేటాయింపులు చేస్తారు. ఇప్పటి వరకు నాలుగు బ్యాచ్‌లు పాస్ అవుట్ అయినట్లు ప్రొఫెసర్ భానుప్రకాష్ తెలిపారు.
ఫిష్ ప్రాసెసింగ్ టెక్నాలజీపై సబ్జెక్టు ప్రొఫెసర్లు చేప, రొయ్య పచ్చళ్లు తయారు చేసే విధానం, కావాల్సిన దినుసులపై ప్రత్యేకంగా కరపత్రాలను ముద్రింపజేసి విద్యార్థులకు, ఆసక్తిగల వారికి పంపిణీ చేస్తున్నారు. పచ్చళ్లకు కావాల్సిన చేపలు, రొయ్యలను మత్స్య కళాశాల ఆవరణలోని పాంపాండ్ నుంచి సేకరించటంతోపాటు బహిరంగ మార్కెట్‌లో లభించే చేపలు, రొయ్యలను కొని తయారు చేస్తున్నారు. పచ్చళ్ల కోసం రవ్వ, మీడియం సైజు రొయ్యలను ఉపయోగిస్తున్నట్లు ప్రొఫెసర్లు తెలిపారు.
మత్స్య కళాశాల విద్యార్థులు తయారు చేసే జల పుష్పాల పచ్చళ్లు గరిష్టంగా మూడు నెలలపాటు నిల్వ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 90 రోజుల పాటు పచ్చడి నిల్వ ఉండేందుకు నిమ్మ రసాన్ని ఉపయోగించడంతోపాటు స్టెరిలైజ్ చేసిన గాజు సీసాలో నింపి లేబుల్ చేస్తారు. నాణ్యమైన నూనె, దినుసులను ఉపయోగిస్తారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండి యా నిబంధనల ప్రకారం.. ఈ చేప, రొయ్యల పచ్చళ్లను తయారు చేస్తున్నట్లు మ త్స్య కళాశాల నుంచి అధికారిక అనుమతులు పొంది పచ్చళ్లు తయారు చేస్తున్నారు.
మత్స్య కళాశాల ల్యాబ్‌లో నిల్వ చేసిన అన్ని రకాల చేపల గురించి వివరిస్తున్న విద్యార్థులు
మత్స్య కళాశాల విద్యార్థులకు చేప, రొయ్య పచ్చళ్లతోపాటు బిర్యానీ, పకోడి, బాల్స్, ఫిష్ ప్రై, కట్‌లేట్, బర్గర్స్, ఫింగర్స్ తదితర ఆహార పదార్థాలను తయారు చేయడం విద్యార్థులు నేర్చుకుని ప్రయోగాత్మకంగా వనపర్తి పరిసర ప్రాంతాల్లో నిర్వహించే ఫుడ్ ఫెస్టివల్స్, అధికారిక కార్యక్రమాల్లో ప్రదర్శనకు ఉంచుతున్నారు.
ఆక్వా కల్చర్, ఫిష్ బయాలజీ, ఫిష్ న్యూట్రీషన్, ఫిష్ హెల్త్, డిసీజెస్, ఫిష్ ప్రాసెసింగ్ టెక్నాలజీ, ఫిషరీష్ ఇంజినీరింగ్, కోస్టల్, మైరెన్ రిసోర్సెస్ సబ్జెక్టులు అందుబాటులో ఉన్నాయి.
మీనం.. రుచికరం
మీనం.. రుచికరం
మీనం.. రుచికరం


