రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక
పాన్‌గల్: మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాల పదోతరగతి విద్యార్థులు జ్యోత్స్న, శ్రుతి, గాయత్రి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికై నట్లు పీడీ శ్యామల శనివారం తెలిపారు. ఈ నెల 22 నుంచి జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. మండలంలోని రేమద్దుల ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు రమేష్‌యాదవ్ విద్యార్థులకు మ్యాట్ షూస్, మండల కేంద్రానికి చెందిన సత్తూరి రాఘవేందర్‌గౌడ్ క్రీడాదుస్తులు అందజేసినట్లు పేర్కొన్నారు. క్రీడాకారులకు చేయూతనందించిన దాతలకు జీహెచ్‌ఎం విజయలక్ష్మి, పీడీ శ్యామల, ఉపాధ్యాయ బృందం కృతజ్ఞతలు తెలిపారు.


