డయల్ 100 ఫిర్యాదులకు సత్వరం స్పందించాలి
పాన్‌గల్: డయల్ 100 ఫిర్యాదులకు వెంటనే స్పందించాలని డీఎస్పీ వెంకటేశ్వర్‌రావు సిబ్బందికి సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శనివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌ను ఆయన సందర్శించి రికార్డులు, సిబ్బంది పనితీరు, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. చట్టానికి కట్టుబడి సక్రమంగా విధులు నిర్వర్తించాలని, గ్రామాల్లో నేరాలు జరగకుండా గస్తీ నిర్వహించాలని ఆదేశించారు. సీసీ కెమెరాలపై ప్రజలను చైతన్యం చేసి ఏర్పాటు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. స్థానిక ఎన్నికల దృష్ట్యా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఎస్‌ఐ శ్రీనివాసులు, సిబ్బంది పాల్గొన్నారు.
28 నుంచి జిల్లాస్థాయి సైన్స్ ఎగ్జిబిషన్
వనపర్తిటౌన్: మండలంలోని చిట్యాలలో ఉన్న మహాత్మా జ్యోతిబా పూలే పాఠశాలలో ఈ నెల 28, 29, 30 తేదీల్లో 2025–26 జిల్లాస్థాయి సైన్స్ ఎగ్జిబిషన్, 2024–25 ఇన్‌స్పైర్ ప్రదర్శన నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అభివృద్ధి, స్వయం సమృద్ధి భారత దేశం కోసం శాస్త్ర, సాంకేతికరంగాలైన సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్ అండ్ గణితం (స్టెమ్) ప్రధాన అంశంపై జిల్లాస్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ ఉంటుందని పేర్కొన్నారు.
నేడు ఎన్‌ఎంఎంఎస్ పరీక్ష..
ఎన్‌ఎంఎంఎస్ (నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్‌షిప్) పరీక్షను ఆదివారం నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్ష ఉంటుందని.. జెడ్పీ బాలుర, బాలికల ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రాల్లో 440 మంది విద్యార్థులు, చాణక్య ఉన్నత పాఠశాల కేంద్రంలో 240 మంది.. మొత్తం 680 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు పేర్కొన్నారు.
రామన్‌పాడులో
నిలకడగా నీటిమట్టం
మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో శనివారం సముద్రమట్టానికిపైన 1,020 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాల్వలో నీటి సరఫరా నిలిచిపోగా.. సమాంతర కాల్వ ద్వారా 650 క్యూసెక్కుల వరద జలాశయానికి చేరుతుందని వివరించారు. అలాగే జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 875 క్యూసెక్కులు, వివిధ ఎత్తిపోతల పథకాలకు 448 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగించినట్లు చెప్పారు.
నేడు ఎకై ్సజ్‌శాఖ మంత్రి జూపల్లి రాక
వీపనగండ్ల: రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం మండల కేంద్రానికి రానున్నారని కాంగ్రెస్‌పార్టీ మండల అధ్యక్షుడు బీరయ్యయాదవ్ శనివారం తెలిపారు. మండల కేంద్రంతో పాటు పాన్‌గల్, చిన్నంబావిలో జరిగే చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మహిళలకు అందజేయనున్నారని పేర్కొన్నారు. ఆయా మండలాల పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
నాణ్యమైన బోధన
అందించాలి
ఆత్మకూర్: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు సులభతర, నాణ్యమైన బోధన అందించాలని రాష్ట్ర పరిశీలకుడు, మహబూబ్‌నగర్ డైట్ కళాశాల ప్రిన్సిపాల్ మిరాజ్ ఉల్లాఖాన్ ఉపాధ్యాయులను ఆదేశించారు. శనివారం స్థానిక బాలికల ఉన్నత పాఠశాల, ఉర్దూ మాధ్యమ పాఠశాలను ఆయన సందర్శించి విద్యార్థులకు అందుతున్న బోధనపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులు బాగా చదివి దేశం గర్వించేస్థాయికి ఎదగాలని సూచించారు. అలాగే విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి నాణ్యత ప్రమాణాలు, శుభ్రత పాటించాలని వంట కార్మికులకు సూచించారు. ఆయనవెంట మండల విద్యాధికారి కొండాపురం బాలరాజు, ప్రధానోపాధ్యాయులు బాలస్వామి, కృష్ణయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.
డయల్ 100 ఫిర్యాదులకు సత్వరం స్పందించాలి


