అంకితభావంతో బోధన
రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణలో ఏర్పాటు చేసిన తొలి మత్స్య కళాశాలలో ఎంసెట్ ర్యాంకుతో సీటు దక్కించుకున్నాను. ఇక్కడి ఫ్రొఫెసర్లు ఎంతో అంకితభావంతో విద్యా బోధన చేస్తున్నారు. ఆహార పదార్థాలు తయారు చేయడంతోపాటు వలలు తయారు చేయడం, చేపల ఉత్పత్తి, హెల్త్, షిప్‌ల తయారీ తదితర సబ్జెక్టులు నేర్చుకున్నాం.
– ప్రత్యూష,
ఫైనల్ ఇయర్, మత్స్య కళాశాల, కరీంనగర్
మాంసాహారం ఇష్టపడే వారికి మటన్, చికెన్ కంటే చేపలతో తయారు చేసిన ఆహారం ఎంతో ఆరోగ్యకరమైంది. ఎక్కువ మంది చేపలతో తయారు చేసిన ఆహారం తినేందుకు ఇష్టపడతారు. ఫుడ్ ఫెస్టివల్స్‌కు వెళ్లినప్పుడు చేప, రొయ్యలతో ఇలాంటి ఆహార పదార్థాలు కూడా తయారు చేస్తారా అంటూ ఎంతో మంది ఇష్టంగా తింటారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి గతంలో వనపర్తిలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో చాలా రకాల ఆహార పదార్థాలు ప్రదర్శించాం.
– జానీపాషా,
ఫైనల్ ఇయర్, మత్స్య కళాశాల, ఖమ్మం
చేపలు పట్టే విధానం ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటుంది. చెరువులు, నదుల్లో ఒకలా చేపల వేట సాగిస్తే.. సముద్రంలో మరోలా ఉంటుంది. తెలంగాణలో సముద్రం లేకపోవడంతో ఫీల్డ్ విజిట్ కోసం ఫ్రొఫెసర్లు కాకినాడ, విశాఖపట్టణం, కోల్‌కత్తా తీసుకువెళ్లారు. ఈ ఫీల్డ్ విజిట్ ఎడ్యుకేషన్ కార్యక్రమంతో చాలా వరకు అవగాహన వస్తుంది.
– మమత, ఫైనల్ ఇయర్, మత్స్య కళాశాల, అచ్చంపేట, నాగర్‌కర్నూల్ జిల్లా
మేము తయారు చేసే చేప, రొయ్య పచ్చళ్లలో రొయ్య పచ్చడికి ఎక్కువగా డిమాండ్ వస్తోంది. 350 గ్రాముల పచ్చడికి రూ.500 వెచ్చించి కొనుగోలు చేసేందుకు సైతం ఇష్టపడుతున్నారు. పచ్చడి కోసం రొయ్యలను మన ప్రాంతంతోపాటు నెల్లూరు నుంచి ప్రత్యేకంగా తెప్పించి తయారు చేస్తున్నాం.
– శ్రీకర్, ఫైనల్ ఇయర్,
మత్స్య కళాశాల, విశాఖపట్టణం
మాంసాహారంలో నోటి రుచితోపాటు దీర్ఘకాలిక వ్యాధులు తగ్గించే గుణం సీ ఫుడ్‌లో ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా చెరువులోని చేపలు, రొయ్యలతోపాటు సముద్ర చేపలు, రొయ్యలను తెప్పించి పచ్చళ్లు తయారు చేసి విక్రయిస్తున్నాం. విద్యార్థులకు ఇదొక సబ్జెక్టు కాబట్టి చేపలు, రొయ్యలతో తయారు చేసే అన్ని రకాల ఆహార పదార్థాలను తయారు చేయడం నేర్పిస్తాం.
– డాక్టర్ ఓబులేసు,
ప్రొఫెసర్, మత్స్య కళాశాల, పెబ్బేరు
అంకితభావంతో బోధన
అంకితభావంతో బోధన
అంకితభావంతో బోధన
అంకితభావంతో బోధన


