వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలి
ఆత్మకూర్: ఇంటర్ విద్యార్థులు రానున్న వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని.. అందుకు అధ్యాపకులు ప్రణాళికతో బోధించడంతో పాటు సన్నద్ధం చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. శనివారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆయన ఆకస్మికంగా సందర్శించి బోధన, మౌలిక సదుపాయాలు, విద్యార్థులు, అధ్యాపకుల హాజరుశాతం, కలెక్టర్ నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఆయన వెంట డీవైఎస్‌ఓ సుధీర్‌రెడ్డి, తహసీల్దార్ చాంద్‌పాషా, ఎంపీడీఓ శ్రీపాద్, ప్రిన్సిపాల్ సైదులు, క్రీడాకారులు ఉన్నారు.
● యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రీడలపై దృష్టి సారించి జాతీయస్థాయిలో రాణించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి కోరారు. శనివారం మండలంలోని మూలమళ్లలో దేశాయి సరళాదేవి లోమారెడ్డి క్రీడాప్రాంగణంలో కలెక్టర్ నిధులతో ఏర్పాటు చేసిన సింథటిక్ మ్యాట్‌ను వినియోగంలోకి తీసుకొచ్చారు. కబడ్డీ క్రీడాకారులకు గాయాలు కాకుండా మ్యాట్ ఎంతో ఉపయోగపడుతుందని, క్రీడాకారుల సౌకర్యార్థం దేశాయి సరళాదేవి రెండెకరాల స్థలాన్ని ఉచితంగా ఇవ్వడం అభినందనీయమని కొనియాడారు. కబడ్డీ క్రీడాకారులు సీఎం కప్‌లో రాష్ట్రస్థాయిలో మొదటి బహుమతి సాధిస్తే ప్రత్యేక బహుమతి అందిస్తానని ప్రకటించారు.


