జిల్లా ఎస్పీగా డి.సునీత | - | Sakshi
Sakshi News home page

జిల్లా ఎస్పీగా డి.సునీత

Nov 22 2025 8:32 AM | Updated on Nov 22 2025 8:32 AM

జిల్ల

జిల్లా ఎస్పీగా డి.సునీత

వనపర్తి: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ఎస్పీలకు స్థాన చలనం క ల్పించింది. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం రాష్ట్రంలోని వివిధ జిల్లాల ఎస్పీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న రావుల గిరిధర్‌ను యాంటీ నార్కొటిక్‌ బ్యూరోకు బదిలీ చేయగా.. ఆయన స్థానంలో పోస్టింగ్‌ కోసం వెయిటింగ్‌లో ఉన్న డి.సునీతను నియమించారు. జిల్లాలో ఏడాదికిపైగా ఎస్పీగా పనిచేసిన రావుల గిరిధర్‌ తనదైన మార్క్‌ చూపించారు.

రైతులకు ఇబ్బందులు

కలిగించొద్దు

గోపాల్‌పేట: రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని రెవెన్యూ అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌ నిర్వాహకులను ఆదేశించారు. శుక్రవారం మండలంలోని తాడిపర్తి, పొలికెపాడులో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్రాలకు వచ్చిన రైతుల పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు రికార్డుల్లో నమోదు చేయాలని సూచించారు. తాలు, మట్టి లేకుండా నాణ్యమైన ధాన్యం కొనుగోలు చేయాలని, వెంటనే ట్యాబ్‌ ఎంట్రీ ప్రక్రియ చేపట్టాలని తెలిపారు. ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న ట్యాబ్‌ ఎంట్రీలను సైతం వెంటనే పూర్తి చేయాలని సూచించారు. నిర్దేశిత తేమశాతం వచ్చిన వెంటనే ధాన్యం కొనుగోలు చేసి రైస్‌మిల్లుకు తరలించి ట్రక్‌ షీట్‌ తెప్పించుకోవాలని, రైతులకు డబ్బులు త్వరగా అందించేలా చూడాలన్నారు. ఆయన వెంట స్థానిక అధికారులు ఉన్నారు.

నేడు మంత్రి

వాకిటి శ్రీహరి రాక

ఆత్మకూర్‌: రాష్ట్ర పశువర్ధకశాఖ మంత్రి డా. వాకిటి శ్రీహరి శనివారం మండలంలో పర్యటించనున్నట్లు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రహ్మతుల్లా శుక్రవారం తెలిపారు. ఉదయం 11 గంటలకు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో డయాలసిస్‌ కేంద్రం, పుర కార్యాలయ ఆవరణలో ఓపెన్‌ జిమ్‌ ప్రారంభిస్తారన్నారు. అనంతరం బాలకిష్టాపూర్‌లో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని.. పార్టీ నాయకులు, కార్యకర్తలు, మాజీ ఎంపీటీసీలు, మాజీసర్పంచ్‌లు అధికసంఖ్యలో పాల్గొనాలని కోరారు.

రామన్‌పాడుకు

నీటి సరఫరా నిలిపివేత

మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయానికి శుక్రవారం జూరాల ఎడమ, సమాంతర కాల్వ ద్వారా నీటి సరఫరా నిలిచినట్లు ఏఈ వరప్రసాద్‌ తెలిపారు. ప్రస్తుతం జలాశయంలో సముద్రమట్టానికి పైన 1,020 అడుగుల నీటిమట్టం ఉందన్నారు. జలాశయం నుంచి ఎన్టీఆర్‌ కాల్వకు 875 క్యూసెక్కులు, వివిధ ఎత్తిపోతల పథకాలకు 448 క్యూసె క్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసె క్కుల నీటిని వినియోగిస్తున్నట్లు వివరించారు.

రైతులకు రసీదు ఇచ్చాకే ధాన్యం తరలించాలి

పాన్‌గల్‌: కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతుల నుంచి ధాన్యం సేకరించాక రసీదు ఇచ్చిన తర్వాతే మిల్లుకు తరలించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ గోవర్ధన్‌సాగర్‌ తెలిపారు. శుక్రవారం మండలంలోని దావాజిపల్లి, అన్నారం, గోప్లాపూర్‌, కొత్తపేట, మాందాపూర్‌, బుసిరెడ్డిపల్లి, కేతేపల్లి, జమ్మాపూర్‌, బండపల్లి, పాన్‌గల్‌లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను మండలస్థాయి నాయకులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తేమశాతం పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దని, కేంద్రాలకు వచ్చిన ధాన్యం వివరాలను వెంటనే రికార్డుల్లో నమోదు చేయాలన్నారు. రైతులు కూడా నాణ్యమైన ధాన్యాన్నే కేంద్రాలకు తీసుకురావాలని, నిర్ధేశిత తేమశాతం వచ్చే వరకు ఆరబెట్టాలని సూచించారు. కార్యక్రమంలో విండో డైరెక్టర్లు ఉస్మాన్‌, సాయిప్రసాద్‌గౌడ్‌, ఐకేపీ ఏపీఎం వెంకటేష్‌, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు సురేఖ, మండల నాయకులు పాల్గొన్నారు.

జిల్లా ఎస్పీగా డి.సునీత 
1
1/2

జిల్లా ఎస్పీగా డి.సునీత

జిల్లా ఎస్పీగా డి.సునీత 
2
2/2

జిల్లా ఎస్పీగా డి.సునీత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement