ఉపాధి దొరుకుతుంది..
కరువు కూలీ పనులు సమృద్ధిగా దొరుకుతున్నాయి. అడిగిన వెంటనే పని కల్పిస్తున్నారు. రోజు పని వెళ్లడంతో కూలి డబ్బులు వారం వారం అందుతున్నాయి. పొలం లేని మాలాంటి వారిని ఉపాధి పథకం ఆదుకోంటుంది.
– పద్మమ్మ, ఉపాధి కూలీ, పాంరెడ్డిపల్లి
ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలంలోని అన్ని గ్రామాల్లో ఉపాధి పనుల ఎంపికకు గ్రామసభలు నిర్వహించాం. ఆయా గ్రామాల్లో చేపట్టాల్సిన పనులపై ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. మండలంలో అడిగిన ప్రతి వ్యవసాయ కూలీకి పని కల్పించేందుకు చర్యలు తీసుకున్నాం. జాబ్‌కార్డు కావాలని దరఖాస్తు చేసుకున్న వారికి వారంలో చేతికి అందిస్తున్నాం.
– బాలయ్య, ఏపీఓ, మదనాపురం
జాతీయ ఉపాధిహామీ పథకంలో అడిగిన ప్రతి కూలీకి పనులు కల్పించేలా చర్యలు తీసుకున్నాం. జాబ్‌కార్డు ఉన్న వారందరికి ఉపాధి కల్పిస్తున్నాం. రైతు, గ్రామ ప్రయోజనాల కోసం చేపట్టాల్సిన పనులపై దృష్టి సారిస్తూ వచ్చే ఆర్థిక సంవత్సరం నివేదికను సిద్ధం చేస్తున్నాం. – ఉమాదేవి, డీఆర్డీఓ
●
ఉపాధి దొరుకుతుంది..


