నేర రహిత సమాజమే ధ్యేయం
పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన
వివిధ పాఠశాలల క్రీడాకారులు
వనపర్తి: నేర రహిత సమాజ నిర్మాణమే ధ్యేయంగా పోలీసు అధికారులు, సిబ్బంది సమష్టిగా విధులు నిర్వహించాలని ఎస్పీ రావుల గిరిధర్ కోరారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్‌ఐలు, సీఐలు, డీఎస్పీలతో నెలవారి నేర సమీక్ష నిర్వహించి పోలీస్‌స్టేషన్ల వారీగా నమోదైన గ్రేవ్ కేసులు, ఆయా కేసుల విచారణలో అధికారులు సేకరిస్తున్న ఆధారాలను పరిశీలించారు. రోడ్డు ప్రమాదాల కేసుల్లో విచారణ ఏ విధంగా చేపడుతున్నారని అడిగి తెలుసుకున్నారు. అదృశ్యం, దొంగతనం కేసుల దర్యాప్తులో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. ప్రజలకు సత్వర న్యాయం, నేరాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవడం మాత్రమే కాదని.. ముందు నుంచే వాటిని అరికట్టే విధానాలపై దృష్టి సారించాలన్నారు. గ్రామస్థాయిలో సమాచార వ్యవస్థను పటిష్టం చేసుకొని వీపీఓ విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని.. గ్రామాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తినా వెంటనే సమాచారం అందేలా చూసుకోవాలని సూచించారు. ఠాణాల్లో రిసెప్షన్, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని.. ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి వారి సమస్యలు పరిష్కరించి పోలీసు వ్యవస్థపై నమ్మకం పెంపొందించే చూడాలన్నారు. రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ రికార్డుల నిర్వహణ పక్కాగా చేపట్టాలని కోరారు. సమావేశంలో డీసీఆర్బీ డీఎస్పీ ఉమామహేశ్వరరావు, వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వరరావు, ఆత్మకూర్ సీఐ శివకుమార్, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, డీసీఆర్బీ ఎస్‌ఐ తిరుపతిరెడ్డి, డీసీఆర్బీ, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.
నేర రహిత సమాజమే ధ్యేయం


