90 రోజుల ప్రణాళిక పక్కాగా అమలు
వనపర్తి రూరల్: ఇంటర్మీడియట్ కళాశాలల్లో 90 రోజుల ప్రణాళిక పక్కాగా అమలు చేయాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి ఎర్ర అంజయ్య కోరారు. గురువారం పెబ్బేర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆయన తనిఖీ చేసి రికార్డులు, విద్యార్థులు, అధ్యాపకుల హాజరు పట్టికలను పరిశీలించారు. అలాగే ల్యాబ్‌ల వివరాలు, సబ్జెక్టుల వారీగా అధ్యాపకుల వివరాలపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సిలబస్‌ను త్వరగా పూర్తి చేసి ఫిబ్రవరిలో జరిగే వార్షిక పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయాలని అధ్యాపకులను ఆదేశించారు. అంతకుముందు తరగతి గదుల్లో విద్యార్థులతో మాట్లాడారు. క్రమం తప్పకుండా తరగతులకు హాజరు కావాలని.. ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరు శాతాన్ని ఉన్నతాధికారులు కంట్రోల్ రూమ్‌లో పర్యవేక్షిస్తారన్నారు. ఉత్తీర్ణత శాతం పెంచే విధంగా బాగా చదవాలని సూచించారు. మొదటి సంవత్సరంలో విద్యార్థుల ప్రవేశాల సంఖ్యను పెంచినందుకు అధ్యాపకులను అభినందించారు. ఆయన వెంట ప్రిన్సిపాల్ ఓబుల్‌రెడ్డి, అధ్యాపక బృందం, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు ఉన్నారు.


