అకాల వర్షం.. తడిసిన ధాన్యం
వనపర్తి రూరల్: పెబ్బేరులో బుధవారం సాయంత్రం కురిసిన వర్షానికి వ్యవసాయ మార్కెట్‌యార్డులో రైతులు ఆరబోసిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. ధాన్యంపై టార్పాలిన్లు కప్పేందుకు కూడా సమయం దొరకలేదని.. ధాన్యం తడిసినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
కనులపండువగా
ఆదిదంపతుల కల్యాణం
కొత్తకోట రూరల్: కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని మండలంలోని కానాయపల్లి స్టేజీ సమీపంలో ఉన్న దత్త కోటిలింగేశ్వరస్వామి ఆలయంలో బుధవారం ఆదిదంపతులైన శివపార్వతుల కల్యాణం కనులపండువగా జరిగింది. అర్చకులు వేదమంత్రోచ్ఛారణల నడుమ సంకల్ప, మాంగళ్య పూజలు నిర్వహించగా.. భక్తులు తలంబ్రాలు పోసి అమ్మవారికి వడి బియ్యం పోశారు. కల్యాణ వేడుకను తిలకించేందుకు భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేయడంతో పాటు అన్నదానం చేశారు.
ఉమ్మడి జిల్లా
హ్యాండ్‌బాల్ జట్ల ఎంపిక
కోస్గి రూరల్: ఉమ్మడి జిల్లా అండర్ – 17 హ్యాండ్‌బాల్ బాల,బాలికల జట్లు ఎంపిక చేశామని ఉమ్మడి జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ సెక్రెటరీ జీయావుధ్దిన్, ఎజ్జీఎప్ సెక్రెటరీ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. బుధవారం పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో ఈమేరకు ఎంపికలు చేపట్టారు. ఇందులో ఉమ్మడి జిల్లా పరిది నుంచి 180 మంది బాల బాలికలు పాల్గొన్నారు. ప్రతిభ కనబరచిన 16 మంది బాలురు, 16 బాలికలను ఉమ్మడి జిల్లా జట్టుగా ఎంపిక చేశామని తెలిపారు. అంతకు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్ల విజయ్‌కుమార్ పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్‌లు సాయినాథ్ , రామకృష్ణారెడ్డి , రవికుమార్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.
అకాల వర్షం.. తడిసిన ధాన్యం
అకాల వర్షం.. తడిసిన ధాన్యం


