కమీషన్‌.. అందేనా? | - | Sakshi
Sakshi News home page

కమీషన్‌.. అందేనా?

Oct 22 2025 10:21 AM | Updated on Oct 22 2025 10:21 AM

కమీషన

కమీషన్‌.. అందేనా?

కమీషన్‌ డబ్బులు రాలే..

ఐకేపీ ద్వారా పాంరెడ్డిపల్లి, కొంకన్వానిపల్లి, చంద్రప్పతండాలో కేంద్రాలు ఏర్పాటుచేసి వరి ధాన్యం సేకరించి గోదాములకు తరలించాం. మా సంఘానికి క్వింటాకు రూ.32 కమీషన్‌ చెల్లిస్తామన్నారు. వానాకాలం, యాసంగి సీజన్‌లో ధాన్యం కొనుగోలు చేసి ప్రభుత్వానికి అందించాం. ఇప్పటి వరకు కమీషన్‌ డబ్బులు అందలేదు. – కె.పద్మ,

గ్రామ సంఘం అధ్యక్షురాలు, పాంరెడ్డిపల్లి

మిగిలేవి 45 శాతమే..

అధికారుల ఆదేశాల మేరకు ప్రతి సీజన్‌లో వరి కొనుగోలు కేంద్రాల నిర్వహణ బాధ్యత చేపడుతున్నాం. ప్రభుత్వం చెల్లించే కమీషన్‌ డబ్బుల్లో తమ సంఘం కేవలం 45 శాతం మాత్రమే వినియోగించుకోవాల్సి వస్తోంది. వచ్చిన డబ్బులను సమాఖ్య అభివృద్ధితో పాటు సేవలు అందించిన వారికి ఇవ్వాలి.

– వెంకటమ్మ, మండల సమాఖ్య

అధ్యక్షురాలు, ఈర్లదిన్నె

ఉన్నతాధికారులకు

నివేదించాం..

2023–24 సంవత్సరం వానాకాలం, యాసంగికి సంబంధించిన కమీషన్‌ డబ్బులు ఇదివరకే చెల్లించాం. 2024–25 సీజన్‌ కొనుగోలుకు సంబంధించిన వివరాలను పౌరసరఫరాలశాఖ ఉన్నతాధికారులకు నివేదించాం. రాష్ట్రవ్యాప్తంగా చెల్లింపులు జరగాల్సి ఉంది. వచ్చిన వెంటనే వారి వారి ఖాతాల్లో జమ చేస్తాం.

– ఖీమ్యానాయక్‌, రెవెన్యూ అదనపు కలెక్టర్‌

అమరచింత: జిల్లాలోని వరి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు 2024–2025 వానాకాలం, యాసంగి కమీషన్‌ సుమారు రూ.15.99 కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ధాన్యం కొనుగోలు నుంచి గోదాములకు తరలించే వరకు ఎదురయ్యే ఇబ్బందులను అధిగమిస్తూ ఇచ్చిన లక్ష్యాన్ని పూర్తి చేస్తున్నా.. కమీషన్‌ డబ్బులు సకాలంలో అందకపోవడంతో మహిళా సంఘాల సభ్యులు కొనుగోళ్లుకు ముందుకురాని పరిస్థితులు నెలకొన్నాయి. కాగా 2023–2024 వానాకాలం, యాసంగి కొనుగోళ్ల కమీషన్‌ డబ్బులు సుమారు రూ.9 కోట్లు ఇటీవల ప్రభుత్వం విడుదల చేసింది. క్వింటా కొనుగోలుపై ప్రభుత్వం రూ.32 చెల్లిస్తుండటంతో ఐకేపీతో పాటు మెప్మా, పీఏసీఎస్‌ సంఘాలు రైతులకు ఇబ్బందులు కలగకుండా రైతుల పొలాల వద్దే ధాన్యం సేకరిస్తూ ఇటు అన్నదాతలకు, అటు ప్రభుత్వానికి సహకరిస్తున్నారు. ఐకేపీ మహిళా సంఘాలకు మంజూరైన కమీషన్‌ డబ్బుల్లో కేవలం 45 శాతం మాత్రమే వినియోగించుకునే సదుపాయం కల్పించడంతో కొనుగోళ్లపై వారు అనాసక్తి కనబరుస్తున్నారు.

వరి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకుఅందని డబ్బులు

రెండు సీజన్లకుగాను రూ.15 కోట్ల పైచిలుకు బకాయి

జిల్లావ్యాప్తంగా 368 కొనుగోలు కేంద్రాలు

మహిళా సంఘాల ఎదురుచూపులు

కమీషన్‌.. అందేనా? 1
1/3

కమీషన్‌.. అందేనా?

కమీషన్‌.. అందేనా? 2
2/3

కమీషన్‌.. అందేనా?

కమీషన్‌.. అందేనా? 3
3/3

కమీషన్‌.. అందేనా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement