
ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
వనపర్తి రూరల్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ మెంటెపల్లి పురుషోత్తంరెడ్డి అన్నారు. సోమవారం పెబ్బేరు పట్టణంలో ఏర్పాటుచేసిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదల సంక్షేమం కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ తరఫున మెజార్టీ స్థానాల్లో విజయం సాధించాలన్నారు. ప్రతి బూత్‌లో కమిటీలను ఏర్పాటుచేసి.. ఈ నెల 25, 26 తేదీల్లో సమావేశం నిర్వహించాలని సూచించారు. ఆగస్టు 1, 2 తేదీల్లో గ్రామాల్లో పాదయాత్ర చేపట్టి.. స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు నాగరాజుయాదవ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రామన్‌గౌడ్, నియోజకవర్గ కన్వీనర్ శ్రీనివాస్‌గౌడ్, రాఘవేందర్‌గౌడ్, వెంకట్రామారెడ్డి, నారాయణ తదితరులు ఉన్నారు.
రామన్‌పాడులో 1,019 అడుగుల నీటిమట్టం
మదనాపురం: రామన్‌పాడు జలాశయంలో సో మవారం 1,019 అడుగులకు నీటిమట్టం వచ్చి చేరింది. జూరాల ఎడమ కాల్వ నుంచి 1,030, స మాంతర కాల్వ ద్వారా 700 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. రామన్‌పాడు జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 894, కుడి, ఎడమ కాల్వలకు 52, వివిధ లిఫ్ట్‌లకు 872, తాగునీటి అవసరాల కోసం 20 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు.
అభివృద్ధి పనులు
పూర్తి చేయరా?
వనపర్తి: జిల్లా కేంద్రంలో చేపట్టిన అభివృద్ధి పనులు సంవత్సరాల తరబడి అసంపూర్తిగా ఉండటం సిగ్గుచేటని బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ రాచాల యుగంధర్‌గౌడ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని చింతల ఆంజనేయస్వామి, కాళికాంబ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మార్నింగ్ వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. రోడ్ల విస్తరణ పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. రూ.కోట్లతో నిర్మించిన టౌన్ హాల్, కూరగాయల మార్కెట్ సముదాయం, ఇండోర్ స్టేడియాన్ని అందుబాటులోకి తేవాలన్నారు. పాత బస్టాండ్‌ను పునర్నిర్మించి ప్రయాణికులకు అందుబాటులోకి తేవాలని ఆర్టీసీ అధికారులను కోరారు. హాకీ అకాడమీలో క్రీడాకారులకు సరైన వసతులు కల్పించకపోవడం సరికాదన్నారు. స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ సొంత జిల్లాలో క్రీడాకారులు ఇబ్బందులకు గురికావడం బాధాకరమని అన్నారు. అసంపూర్తి పనులపై ప్రత్యేక దృష్టిసారించి త్వరగా పూర్తిచేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి దయానంద్, నాయకులు వహీద్, రమేశ్‌సాగర్, దేవర శివ, వీవీ గౌడ్, గూడుషా, ధర్మేంద్ర సాగర్, రమేశ్, నర్సింహ యాదవ్, ప్రసాద్‌గౌడ్, నాగరాజు, నరేందర్, యశ్వంత్ పాల్గొన్నారు.

ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి