
అందుబాటులోకి రానున్న భవనాలివే..
ప్రస్తుతం వైద్య కళాశాల కొనసాగుతున్న నర్సింగ్ కళాశాల భవనం మూడేళ్ల కిందటే అందుబాటులోకి వచ్చింది.
● యూజీ, పీజీ విద్యార్థులు 1,500 చదువుకునేలా మూడంతస్తుల వైద్య కళాశాల భవనం నిర్మాణంలో ఉంది. ఇందులో 8 డిపార్ట్‌మెంట్ల తరగతి గదులు, 8 ల్యాబ్‌లు ఉంటాయి.
● 514 మంది విద్యార్థినులు ఉండేలా హాస్టల్ భవనాన్ని ఆరు అంతస్తుల్లో నిర్మించారు. ఇందులో 225 గదులు, అదనంగా 32 గదులు నిర్మాణం చేస్తున్నారు.
● 391 మంది విద్యార్థులు ఉండేలా ఐదు అంతస్తుల పురుషుల హాస్టల్ భవనం నిర్మాణం చేశారు.
● గ్రౌండ్‌ఫ్లోర్‌లో 9,047 ఎస్‌ఎఫ్‌టీలో ఏకకాలంలో 300 మంది విద్యార్థులు భోజనం చేసేందుకు సౌకర్యంగా డైనింగ్ హాల్, కిచెన్ నిర్మాణం చేశారు.
● 78 మంది నివాసం ఉండేలా 78 గదులతో బాలికల రెసిడెన్సీ నిర్మాణం చేశారు.
● మూడంతస్తుల భవనంలో కళాశాల ప్రిన్సిపాల్, ఆస్పత్రి సూపరింటెండెంట్, ఎస్‌ఆర్‌లు, మెడికల్ కళాశాల అధ్యాపకులు ఉండేలా భవనం నిర్మాణం చేశారు.