
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి
వనపర్తి: బాలకార్మికులను గుర్తించి వారిని సంరక్షించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆపరేషన్ ముస్కాన్ నిర్వహిస్తోందని.. అన్ని శాఖల సమష్టి కృషితో బాల కార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలిద్దామని ఎస్పీ రావుల గిరిధర్ కోరారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో ఎస్పీ సమావేశమై పలు సూచనలు చేశారు. హోటళ్లు, ఇటుక బట్టీలు, నిర్మాణ పనులు, వ్యాపార సముదాయాల్లో పనిచేస్తున్న బాల కార్మికులను గుర్తించి వారిని తల్లిదండ్రులు లేదా సంరక్షణ గృహాలకు చేర్చి యజమానులపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా బాల్యం బడులకు అంకితం కావాలని, కార్మికులు, కర్షకులుగా కొనసాగరాదని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 50 మంది బాలలను రక్షించి తల్లిదండ్రులు, సంరక్షణ స్థలాలకు చేర్చడంతో పాటు తల్లిదండ్రులకు అవగాహన కల్పించి పాఠశాలలో చేర్పించామని.. మొత్తం 7 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. నిరాదరణకు గురైన, తప్పిపోయిన పిల్లలు, వెట్టి చాకిరీకి గురవుతున్న పిల్లలు కనిపిస్తే హెల్ప్‌లైన్ నంబర్ 1098 గాని, డయల్ 100కి సమాచారం ఇవ్వాలని సూచించారు. వారం పాటు పర్యటించి బాల కార్మికులను గు ర్తించాలన్నారు. ఆపరేషన్ ముస్కాన్ ఎస్‌ఐ రా ము, ఏహెచ్‌టీయూ ఎస్‌ఐ అంజద్, లేబర్ అధి కారి రఫీ, చైల్డ్ ప్రొటెక్షన్‌శాఖ అధికారి రవిరాజు, వైద్యశాఖ అధికారి నరేందర్ పాల్గొన్నారు.
భూ సమస్యల
పరిష్కారానికి చర్యలు
వనపర్తి: భూ భారతి చట్టం ప్రకారం భూ సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు వివరించారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి సీసీఎల్‌ఏ లోకేష్‌కుమార్ అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లతో రెవెన్యూ సదస్సుల దరఖాస్తులపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరం నుంచి అదనపు కలెక్టర్ పాల్గొని జిల్లా వివరాలు వెల్లడించారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో విచారణ చేసి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నట్లు వివరించారు. సమావేశంలో ఆర్డీఓ సుబ్రమణ్యం, డి–సెక్షన్ సూపరింటెండెంట్ మదన్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి