
ఆదాయమే లక్ష్యంగా..!
వనపర్తి పురపాలికలో కొనసాగుతున్న సర్వే
●
కమిషనర్ ఆదేశాల మేరకు..
పుర కమిషనర్ ఆదేశాల మేరకు ఆదాయం సమకూరే మార్గాలపై దృష్టి సారించాం. ఇందులో భాగంగా ఇంటి కొలతలు లేని, పాత ఇంటికి తీసుకున్న కొలతల ఆధారంగా కొత్త ఇంటికి పన్ను చెల్లిస్తున్న వాటిని గుర్తిస్తున్నాం. ఇప్పటి వరకు కొలతల్లో వ్యత్యాసాలు ఉన్న ఇళ్లను గుర్తించి పురపాలికకు సుమారు రూ.4 లక్షల వరకు అదనపు ఆదాయం సమకూర్చాం. నివాసాలపై ట్రేడ్ లైసెన్స్‌లు, కమర్షియల్ దుకాణాలు రెసిడెన్షియల్‌గా ఉన్న వాటిని గుర్తించి సరిచేస్తున్నాం. ప్రతి వార్డు నుంచి సమగ్ర వివరాలు ఇవ్వాలని వార్డు అధికారులకు సూచించాం.
– డి.సాయిలు,
ఇన్‌చార్జ్ ఆర్వో, వనపర్తి పురపాలిక

ఆదాయమే లక్ష్యంగా..!