
నాటిన ప్రతి మొక్కను కాపాడాలి
ఖిల్లాఘనపురం: వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో నాటిన ప్రతి మొక్కను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని పలువురు అధికారులు, నాయకులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా వర్షాలు కురిసిన వెంటనే నిర్దేశించిన లక్ష్యం మేర మొక్కలు నాటాలన్నారు. అనంతరం గ్రామంలో నిర్మిస్తున్న వేణుగోపాలస్వామి ఆలయాన్ని పరిశీలించి నిర్మాణానికి తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.
ఆర్థికాభివృద్ధి సాధించేందుకే రుణాలు..
రైతులు వ్యవసాయంతో పాటు పశువులు, కోళ్లు, గొర్రెల పెంపకం చేపట్టినప్పుడే ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారని ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో సింగిల్‌విండో ద్వారా రైతులకు కర్షకమిత్ర పథకం కింద మంజూరైన రుణాల ప్రొసీడింగ్‌లు అందించి మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలో ఎక్కడా లేనివిధంగా సింగిల్‌విండో ద్వారా సుమారు రూ.5 కోట్ల కర్షకమిత్ర రుణాలు ఇస్తున్నామని.. రైతులు తీసుకున్న రుణాలను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలన్నారు. త్వరలోనే సింగిల్‌విండో బ్యాంకు ఏర్పాటు చేస్తామని.. అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండల సింగిల్‌విండో చైర్మన్ మురళీధర్‌రెడ్డి, వైస్ చైర్మన్ క్యామ రాజు, డైరెక్టర్లు సాయిచరణ్‌రెడ్డి, రాము, శ్యాంసుందర్‌రెడ్డి, కృష్ణయ్య, మాజీ ఎంపీపీలు కిచ్చారెడ్డి, క్యామ వెంకటయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు విజయ్‌కుమార్ పాల్గొన్నారు.