
ఆయిల్‌పాం సాగుపై అవగాహన కల్పించాలి
ఎర్రవల్లి: తక్కువ పెట్టుబడులతో అధిక ఆదాయాన్ని ఇచ్చే ఆయిల్‌పాం సాగు విషయంలో ప్రభుత్వం చేపడుతున్న ప్రత్యేక చర్యల గురించి గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించాలని టీఎస్ ఆయిల్‌ఫెడ్ జి.ఎం సుధాకర్‌రెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం ఎర్రవల్లి మండల పరిదిలోని కొండేరులో మహిళా రైతు శిరీష పొలంలో ఏర్పాటు చేసిన మెగా ప్లాంటేషన్ కార్యక్రమానికి ఆయన హాజరై జిల్లా ఉధ్యానవన శాఖ అధికారి అక్బర్‌తో కలిసి మొక్కలు నాటి నీరు పోశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 51 ఎకరాల్లో 22మంది రైతుల పొలాల్లో 2907 ఆయిల్‌పాం మొక్కలను ఒకే రోజు నాటడం జరిగిందన్నారు. అధిక ఆదాయానిచ్చే ఆయిల్‌పాం సాగు పై అవగాహన కల్పించి రైతులను ప్రోత్సహించాల ని సూచించారు. ఆయిల్‌పాం మొక్కలు నాటిన నాలుగో సంవత్సరం నుంచి దిగుబడులు ప్రారంభం అవుతాయని దాదాపు 30 సంవత్సరాల వరకు ఈ మొక్కలు దిగుబడిని ఇస్తూ రైతులకు ఆదాయాన్ని ఇస్తాయన్నారు. ఆయిల్‌పాం సాగుతో పాటుగా వాటిలో వివిధ రకాల అంతర పంటలను కూడా సాగుచేసి అదనపు ఆదాయం కూడా పొందవచ్చునని తెలిపారు. ప్రభుత్వం కూడా ఆయిల్‌పాం సాగును పోత్సహిస్తూ పెద్ద ఎత్తున రాయితీలను ఇస్తుందన్నారు. ౖకార్యక్రమంలో ఆయిల్‌ఫెడ్ జిల్లా ఇంచార్జి శివనాగిరెడ్డి, డివిజనల్ ఉధ్యావవన అధికారి ఇమ్రాన్, రాజశేఖర్, మహేష్, ఏరియా అధికారి రామకృష్ణ, రైతులు శేఖర్‌రెడ్డి, చింపరయ్య, రాజు, విజయ్ మోహన్‌రెడ్డి, మహీంద్రారెడ్డి పాల్గొన్నారు.