
గోదాం నిర్మాణంతో రైతులకు ఉపయోగం
గోపాల్‌పేట: ఏదులలో పదివేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో నిర్మించనున్న వ్యవసాయ గోదాంతో ఏదుల, రేవల్లి, గోపాల్‌పేట మండలాల రైతులకు ఎంతో మేలు చేకూరనుందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. శుక్రవారం ఏదులలో గోదాం నిర్మాణానికి సంబంధించి స్థల పరిశీలన చేపట్టారు. భూ సేకరణ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం రూ.25 కోట్లతో నిర్మించనున్న రేవల్లి, అనంతపురం, ఏదుల, తీగలపల్లి రోడ్డును పరిశీలించారు. రోడ్డు నిర్మాణంతో నాగర్‌కర్నూల్, వనపర్తి నియోజకవర్గాల్లోని పలు గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని చెప్పారు. ఉమ్మడి మండలాల ఇన్‌చార్జ్ సత్యశీలారెడ్డి, రేవల్లి అధ్యక్షుడు పర్వతాలు, స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు.