
ప్రతిపక్షాలకు అభివృద్ధితో సమాధానమిస్తాం
మదనాపురం: ప్రతిపక్ష నాయకులు ఎన్ని మాటలు మాట్లాడినా.. అభివృద్ధితోనే సమాధానమిస్తామని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని మార్కెట్‌యార్డ్‌లో రూ.10 లక్షలతో నిర్మించనున్న హమాలి సంఘం భవన నిర్మాణానికి ఆయన భూమిపూజ చేసి మాట్లాడారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని ఏనాడు పట్టించుకోలేదని ఆరోపించారు. నిత్యం శ్రమించే కార్మికుల కష్టాలను గుర్తించి వారు విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా భవన నిర్మాణానికి భూమి పూజ చేస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందుతాయని.. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు. పార్టీలో కష్టపడిన కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లెపాగ ప్రశాంత్, వివిధ గ్రామాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.