
‘శత’క్కొట్టిన కేతన్‌కుమార్
జడ్చర్లకు చెందిన కేతన్‌కుమార్ యాదవ్ బ్యాటింగ్‌లో సంచలనం సృష్టించాడు. రెండేళ్లుగా క్రికెట్‌లో శిక్షణ తీసుకుంటున్న కేతన్ అండర్–23 లీగ్‌లో మూడు సెంచరీలు కొట్టి 474 పరుగులు చేసి బెస్ట్ బ్యాటర్‌గా నిలిచాడు. వనపర్తితో జరిగిన టూ డే లీగ్ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ శతకొట్టి 221 పరుగులు చేశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 113, రెండో ఇన్నింగ్స్‌లో 108 పరుగులు చేశాడు. మహబూబ్‌నగర్‌పై మరో సెంచరీ (101 పరుగులు) చేశాడు. రంజీ జ ట్టులో చోటు దక్కించుకోవడమే ప్రస్తుత లక్ష్యమంటున్నాడు కేతన్‌కుమార్.