
బంతితో తిప్పేసిన ముఖితుద్దీన్
మహబూబ్‌నగర్‌కు చెందిన ముఖితుద్దీన్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. ఇంట్రా డిస్ట్రిక్ట్ అండర్–23 టూ డే లీగ్‌లో బంతిని గింగిరాలు తిరిగేలా బ్యాట్స్‌మెన్‌లను బోల్తా
కొట్టించారు. తన స్పిన్ మాయాజాలంతో టోర్నీలో అత్యధికంగా 34 వికెట్లు తీశాడు. రెండు ఇన్నింగ్స్‌లలో వనపర్తి, నారాయణపేట జట్లపై 10 చొప్పున వికెట్లు, జడ్చర్లపై 5, గద్వాలపై 5, నాగర్‌కర్నూల్‌పై 4 వికెట్లు తీసి రాణించాడు. గతంలో పలుసార్లు హెచ్‌సీఏ టోర్నీల్లో ఎండీసీఏ తరఫున ఆడి ప్రతిభ చాటాడు. 2024లో వరంగల్‌లో జరిగిన హెచ్‌సీఏ అండర్–19 టోర్నీలో 5 మ్యాచుల్లో 14 వికెట్లు తీసి ఉత్తమ బౌలర్‌గా నిలిచాడు. ఈ ఏడాది చైన్నెలో జరిగిన ఆలిండియా యూనివర్సిటీ క్రికెట్ టోర్నీలో నాలుగు ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు తీశాడు. గతేడాది త్రీ డే లీగ్‌లో 8 వికెట్లు తీశాడు. భవిష్యత్‌లో రంజీ, భారత జట్టుకు ఆడడమే తన లక్ష్యమంటున్నాడు ముఖితుద్దీన్.