
కెప్టెన్‌గా రాణించిన అనిత
నారాయణపేట జిల్లా కోస్గి మండలం హన్మాన్‌పల్లికి చెందిన అనిత ఇంట్రా డిస్ట్రిక్ట్ వుమెన్ లీగ్‌లో రెడ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి జట్టును ముందుకు నడిపించి చాంపియన్‌గా నిలవడంలో తన వంతు పాత్ర పోషించారు. రెండు మ్యాచుల్లో 59 పరుగులు చేయడంతో పాటు 4 వికెట్లు తీసింది. వనపర్తిలోని గిరిజన సొసైటీ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతూ ఆల్‌రౌండర్‌గా రాణిస్తోంది. ఎస్‌జీఎఫ్ జాతీయస్థాయి క్రికెట్ టోర్నీలో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించింది. 2021లో హెచ్‌సీఏ మహిళా జట్టుకు ఎంపికై సూరత్‌లో జరిగిన టోర్నీలో ఆడింది. బెంగళూర్‌లో జరిగిన టీ–20 టోర్నీలో హెచ్‌సీఏ జట్టు తరపున పాల్గొంది. హెచ్‌సీఏ టోర్నీల్లో రాణించి భారత జట్టుకు ఎంపికకవుతానని ధీమా వ్యక్తం చేస్తోంది అనిత.