‘సేంద్రియ’ ప్రోత్సాహం | - | Sakshi
Sakshi News home page

‘సేంద్రియ’ ప్రోత్సాహం

Jul 9 2025 7:36 AM | Updated on Jul 9 2025 7:36 AM

‘సేంద్రియ’ ప్రోత్సాహం

‘సేంద్రియ’ ప్రోత్సాహం

జిల్లాలో ఎన్‌ఎంఎన్‌ఎఫ్‌ పథకం అమలు.. 9 పైలెట్‌ గ్రామాలు ఎంపిక

మహిళా సీఆర్పీల

నియామకం..

ఎంపిక చేసిన గ్రామాల్లో సేంద్రియ సాగును విస్తరింపజేయడంతో పాటు రైతులకు అవగాహన కల్పించేందుకు గ్రామంలోని మహిళా సంఘంలో చదువుకున్న మహిళ రైతును సీఆర్పీగా ఎంపిక చేస్తారు. వీరికి కేంద్రం అందించే నిధుల నుంచి నెలకు రూ.4 వేలు వేతనం అందించనున్నారు. కనీసం పదోతరగతి పూర్తిచేసి సాంకేతిక పరిజ్ఞానం కలిగి వ్యవసాయ అనుభవం ఉన్న మహిళనే ఎంపిక చేయనున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు.

భూసార పరీక్షల ఆధారంగా..

సేంద్రియ సాగు కోసం ఎంపిక చేసిన గ్రామాల్లో జనాభా కేటాగిరీల వారీగా రైతుల పొలాల నుంచి మండల వ్యవసాయ విస్తరణ అధికారులు మట్టి నమూనాలు సేకరించడంతో పాటు రైతులకు సేంద్రియ సాగుతో కలిగే లాభాలను వివరిస్తున్నారు. రెండు నెలల కిందటే గ్రామాలు ఎంపిక కావడంతో దాదాపుగా మట్టి నమూనాల సేకరణ పూర్తిచేసి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించినట్లు అధికారులు చెబుతున్నారు. కనీసం ఎకరా పొలం కలిగి ఉన్న రైతులనే ఎంపిక చేశారు. దేశమంతటా సేంద్రియ సాగును ఒకేసారి అమలు చేయడం సాధ్యం కాదని.. మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి రైతులను ప్రోత్సహిస్తూ రానున్న రోజుల్లో కలుషిత ఆహారాన్ని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

అమరచింత: రైతులు త్వరగా పంటలు చేతికి రావాలనే లక్ష్యంతో రసాయన ఎరువులను అధిక మొత్తంలో వినియోగిస్తుండటంతో భూ సారం రోజురోజుకు దెబ్బతినడంతో పాటు పండిన పంట రసాయనాలమయమై ప్రజలు కొత్త కొత్త రోగాల బారినపడి తమ ఆయుష్షును కోల్పోతున్న పరిస్థితులు ఉన్నాయి. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ సాగును ప్రోత్సహిస్తూ ప్రజలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకుగాను కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఎంఎన్‌ఎఫ్‌ (నేషనల్‌ మిషన్‌ ఆన్‌ నాచ్యురల్‌ ఫార్మింగ్‌)పథకాన్ని అమలు చేస్తోంది. రసాయన ఎరువుల వినియోగంతో పొలాలు ఎలా నిర్జీవంగా మారుతున్నాయన్న విషయాలతో పాటు వాటితో ప్రకృతి, మానవాళికి కలిగే నష్టాన్ని వివరిస్తూ క్రమేణా సేంద్రియ సాగువైపు దృష్టి మళ్లించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే జిల్లాలో ని 9 మండలాల్లో 9 గ్రామాలను పైలెట్‌ గ్రామాలుగా ఎంపిక చేసి ఆయా గ్రామా ల్లో జనాభా ప్రాతిపదికన ఎస్టీ, ఎస్సీ, బీసీల వారీగా 125 మంది రైతులను ఎంపిక చేసి వారితో ఏడాది పాటు సేంద్రియ పద్ధతిలో పంటలు పండించేందుకు సిద్ధమయ్యారు.

ఎకరా పొలం మాత్రమే..

ఎంపిక చేసిన రైతుల పొలంలో ఒక ఎకరాలో మాత్రమే సేంద్రియ సాగు చేపట్టనున్నారు. భూసార పరీక్షల ఆధారంగా ఆ రైతు ఏ పంట సాగు చేయాలో అధికారులు సూచిస్తారు. వీరికి మొదటి విడతలో పంటకు సరిపడా వేప పిండి, వేప నూనె ఉచితంగా అందిస్తారు. అలాగే సేంద్రియ విధానంలో పండించిన పంటకు మార్కెట్‌లో ఉండే డిమాండ్‌ను వివరించి చైతన్యపరుస్తారు.

మండలాల వారీగా ఎంపిక చేసిన గ్రామాలివే..

రసాయన ఎరువుల ఆహార నియంత్రణే లక్ష్యం

ఒక్కో గ్రామంలో 125 మంది రైతులతో..

కేంద్ర ప్రభుత్వ సహకారంతో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement