
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
పాన్‌గల్: అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్‌పార్టీ ధ్యేయమని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని రైతువేదికలో మైనార్టీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన 32 కుట్టుమిషన్లను మంత్రి లబ్ధిదారులకు అందజేసి మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, పేదలకు సన్న బియ్యం, రైతు రుణమాఫీ, రైతు భరోసా, సన్నరకం వరికి రూ.500 బోనస్ తదితర పథకాలు అమలు చేస్తూ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నామని పేర్కొన్నారు. ఇది మాటల ప్రభుత్వం కాదని.. చేతల ప్రభుత్వమని ఆయన స్పష్టం చేశారు.
వైఎస్సార్‌కు ఘన నివాళి..
రాష్ట్రాన్ని సంక్షేమ యుగానికి తీసుకెళ్లిన మహానేత డా. వైఎస్ రాజశేఖరరెడ్డి అని మంత్రి కొనియాడారు. వైఎస్సార్ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి మాట్లాడారు. అభివృద్ధిని దిశానిర్దేశం చేసిన చిరస్మరణీయుడని.. ఆయన అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలు ప్రజల గుండెల్లో చిరకాలం నిలిపోతాయన్నారు. అనంతరం రైతువేదిక ఆవరణలో మొక్కలు నాటారు.
ఇందిరమ్మ ఇళ్ల
మంజూరు పత్రాలు పంపిణీ..
మండలంలోని దావాత్‌ఖాన్‌పల్లిలో ఆరుగురు, శాగాపూర్‌లో 13 మంది లబ్ధిదారులకు మంత్రి జూపల్లి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేసి ఇళ్ల నిర్మాణాలకు భూమి పూజ చేశారు. లబ్ధిదారులు త్వరగా ఇళ్లు నిర్మించుకుంటే సకాలంలో నగదు బ్యాంకు ఖాతాలో జమవుతుందన్నారు. అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లు మంజూరు అవుతుందని.. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అర్హులకు చేరేలా అధికారులు, స్థానిక నాయకులు కృషి చేయాలని కోరారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్‌సాగర్, డీఆర్డీఓ ఉమాదేవి, ఎంపీడీఓ గోవింద్‌రావు, పార్టీ మండల అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, విండో డైరెక్టర్ ఉస్మాన్, వెంకటేష్‌నాయుడు, రవికుమార్, భాస్కర్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట
రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు