
కల్యాణలక్ష్మి పేదలకు వరం
కొత్తకోట రూరల్/మదనాపురం: కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేదలకు వరమని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి అన్నారు. మంగళవారం కొత్తకోట ఎంపీడీఓ కార్యాలయంలోని ప్రొ. జయశంకర్ సమావేశ మందిరం, మదనాపురం ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రజాపాలన పాలనలో ప్రతి పేదవాడికి న్యాయం జరుగుతుందన్నారు. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని చెప్పారు. గత ప్రభుత్వంలో పేదలకు పథకాలు దరిచేరక నాయకుల ఇళ్ల చుట్టూ తిరిగేవారని, ప్రజాపాలనలో ఎలాంటి పైరవీలు లేకుండా అర్హులకు న్యాయం జరుగుతుందన్నారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని తెలిపారు. కొత్తకోటలో జరిగిన కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పి.ప్రశాంత్, తహసీల్దార్ ఎం.వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ శ్రీనివాసులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పి.కృష్ణారెడ్డి, ఎన్‌జే బోయేజ్, మేసీ్త్ర శ్రీనివాసులు, మాజీ సర్పంచ్ శేఖర్‌రెడ్డి, మదనాపురంలో జరిగిన కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, తహసీల్దారు జేకే మోహన్, ఎంపీడీఓ ప్రసన్నకుమారి, మార్కెట్ డైరెక్టర్ పావనిరెడ్డి, జగదీష్, సాయిబాబా, ఖాజా మైనుద్దీన్, అంజద్ అలీ, ఆవుల రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.