
వైద్యానికి వెతలు!
ప్రభుత్వ ఆస్పత్రులను వేధిస్తున్న వైద్యులు, సిబ్బంది కొరత
●
సిబ్బందిని నియమించాలి..
ఆత్మకూర్ ప్రభుత్వ ఆస్పత్రికి నర్వ, చిన్నచింతకుంట, దేవరకద్ర, మదనాపురం, అమరచింత తదితర ప్రాంతాల నుంచి రోగులు వస్తారు. ప్రస్తుతం వైద్యులు, సిబ్బంది లేక సరైన వైద్యసేవలు అందక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. దీనికితోడు ఆస్పత్రి భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. కొత్త భవనం నిర్మించి వైద్యులను నియమించాలి. – రాజు,
సీపీఎం మండల కార్యదర్శి, ఆత్మకూర్
ఇబ్బందులు పడుతున్నాం..
ఆస్పత్రి భవనం శిథిలావస్థకు చేరి పైకప్పు పెచ్చులూడుతోంది. వర్షాకాలంలో వర్షపు నీరు గదుల్లోకి చేరుతుండటంతో రోగు లు ఇబ్బందులు పడుతు న్నారు. వైద్యులు, సిబ్బంది నియామకం విషయాన్ని జిల్లా ఉన్నతాధికారులకు నివేదించాం.
– డా. హరినారాయణ, వైద్యాధికారి,
కమ్యూనిటీ హెల్త్‌సెంటర్, ఆత్మకూర్
విధివిధానాలు రావాల్సి ఉంది..
జిల్లాలోని కమ్యూనిటీ హెల్త్‌సెంటర్లలో వైద్యు లు, సిబ్బంది నియామకాలు జరగాల్సి ఉంది. వైద్య విధాన పరిషత్ నుంచి కమ్యూనిటీ హెల్త్‌సెంటర్ల క్యాడర్ స్ట్రెంత్ నియామక వివరాలు వెలువడలేదు, విధివిధానాలు రావాల్సి ఉంది, త్వరలోనే పూర్తిస్థాయిలో నియామకాలు జరగనున్నాయి. – డా. చైతన్యగౌడ్, జిల్లా
సూపరింటెండెంట్, కమ్యూనిటీ హెల్త్‌సెంటర్స్
ఆత్మకూర్: జిల్లాలోని కమ్యూనిటీ హెల్త్‌సెంటర్లలో వైద్యులు, సిబ్బంది సరిపడా లేక సరైన వైద్యం అందక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. దీనికితోడు ఆత్మకూర్, రేవల్లి ఆస్పత్రుల భవనాలు పూర్తిగా శిథిలావస్థకు చేరి పెచ్చులూడి పడుతున్నాయి. పారుశుద్ధ్యం లోపించి రోగాలకు నిలయంగా మారుతున్నాయి.
2022లో వైద్యవిధాన పరిషత్‌లోకి..
ఖిల్లాఘనపురం, వీపనగండ్ల, రేవల్లి, ఆత్మకూర్ ప్రభుత్వ సివిల్ ఆస్పత్రులను 2022లో వైద్యవిధాన పరిషత్ పరిధిలో చేర్చి కమ్యూనిటీ హెల్త్‌సెంటర్లుగా ఉన్నతీకరించారు. ఆయా కేంద్రాల్లో గైనకాలజిస్ట్, డెంటిస్ట్, కార్డియాలజిస్ట్, ఆర్థోపెడిక్, జనరల్ ఫిజీషియన్, ఆఫ్తాల్మిక్, ఈఎన్‌టీ, పిడియాట్రీషన్, ఇలా 16 మంది వైద్యులు, 14 మంది స్టాఫ్‌నర్సులు, అన్నిరకాల వైద్యు పరీక్షలు, 25 మందికిపైగా కార్మికులు విధులు నిర్వర్తించాల్సి ఉండగా ఎక్కడ కూడా నియామకాలు జరగలేదు. ఆత్మకూర్, వీపనగండ్ల, ఖిల్లాఘ నపురం, రేవల్లి కేంద్రాల్లో ప్రస్తుతం ఇద్దరు వైద్యులు, నలుగురు స్టాఫ్‌నర్సులు మాత్రమే పని చేస్తున్నారు.
● అత్యధిక సాధారణ, అసాధారణ (సిజేరియన్) ప్రసవాలు, కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలతో పాటు ఇతర వైద్యసేవలు అందిస్తూ ఆత్మకూర్ ప్రభుత్వ ఆస్పత్రి రికార్డు సొంతం చేసుకుంది. ఏడాదిన్నరగా ఇక్కడి వైద్యులు బదిలీపై వెళ్లడం, కొత్త వైద్యులు, సిబ్బంది లేక పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందడం లేదు.
శిథిలావస్థకు చేరిన పలు భవనాలు
సరైన వైద్యం అందక అవస్థలు పడుతున్న రోగులు
ఆత్మకూర్‌లో ప్రారంభంకాని డయాలసిస్ సేవలు
రంగులు, హంగులతో..
గతంలో అప్పటి అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ ఆత్మకూర్ కమ్యూనిటీ హెల్త్‌సెంటర్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి పరిసరాలను చూసి అసహనం వ్యక్తం చేశారు. గదుల్లోని పైకప్పు పెచ్చులూడటంతో పాటు వర్షపునీరు లోనికి చేరి రోగులు ఇబ్బందులు పడుతున్నారని, గోడలు తడిసి విద్యుత్‌షాక్ వస్తోందని సిబ్బంది తమ గోడు వెల్లబోసుకున్నారు. తాత్కాలిక మరమ్మతులకుగాను రూ.5.60 లక్షలు కలెక్టర్ విడుదల చేయగా కాంట్రాక్టర్ గోడలకు రంగులు వేసి బిల్లులు దండుకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై కలెక్టర్, ఎమ్మెల్యే స్పందించి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

వైద్యానికి వెతలు!

వైద్యానికి వెతలు!

వైద్యానికి వెతలు!