
భూ భారతి సమస్యలు పరిష్కరించాలి
వనపర్తి: పైలెట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసిన గోపాల్‌పేట మండలంలోని భూ భారతి దరఖాస్తులను జూన్ 2లోగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. మంగళవారం కలెక్టర్ తన చాంబర్‌లో భూ భారతిలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారంపై సమీక్ష నిర్వహించారు. పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన గోపాల్‌పేట మండలంలో ఈ నెల 5 నుంచి 13 వరకు భూ భారతి సమస్యలపై 573 దరఖాస్తులు వచ్చాయని, ఇందులో 155 సెక్సేషన్, 131 సాదాబైనామా, పెండింగ్ మ్యుటేషన్, అసైన్‌మెంట్ తదితర దరఖాస్తులు ఉన్నాయన్నారు. వీటన్నింటినీ వచ్చే నెల 2లోగా పరిష్కరించాల్సి ఉందన్నారు. తహసీల్దార్ లాగిన్‌లో పరిష్కారమయ్యే వాటిని త్వరగా పూర్తిచేయాలని, ఆర్డీఓ లాగిన్‌కు, కలెక్టర్ ద్వారా పరిష్కరించాల్సినవి కలెక్టర్ లాగిన్ కు పంపించాలని తహసీల్దార్లను ఆదేశించారు. జూన్ 2 నుంచి జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామాల్లో భూ భారతి చట్టం అమలు చేసేందుకు రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని, ఇందుకోసం ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, తహసీల్దార్లు పాండునాయక్, రాజు, సెక్షన్ సూపరింటెండెంట్ మదన్‌మోహన్ తదితరులు పాల్గొన్నారు.
భూ సమస్య పరిష్కారం
మదనాపురం: మండలంలోని ద్వారకనగర్ గ్రామంలో పెండింగ్‌లో ఉన్న భూ సమస్యను కలెక్టర్ ఆదర్శ్ సురభి స్వయంగా మోకా మీదకి వెళ్లి పరిష్కరించా రు. కలెక్టర్ వెంట తహసీల్దార్ అబ్రహం లింకన్, గిర్దా వర్ రాజేశ్వరి, సర్వేయర్ సుచరిత తదితరులున్నారు.