
చట్టాలపై అవగాహన అవసరం
వనపర్తి రూరల్: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ న్యాయమూర్తి రజని ఆదేశానుసారం ఆదివారం మండలంలోని అచ్యుతాపురం గ్రామపంచాయతీ కార్యాలయంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఉత్తరయ్య గ్రామస్తులకు చట్టాలు, భూ భారతిపై అవగాహన కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి చట్టం గురించి రైతులు తెలుసుకొని భూ సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మత్తు పదార్థాలు విక్రయించినా, రవాణా చేసినా హెల్ప్‌లైన్ నంబర్ 1908కు ఫిర్యాదు చేయాలన్నారు. బాలలు, వృద్ధులు, మహిళలకు జిల్లా న్యాయ సేవాఽధికార సంస్థ తరఫున ఎలాంటి ఫీజు లేకుండా ఉచితంగా న్యాయ సాయం పొందవచ్చతెలిపారు. మరిన్ని వివరాలకు టోల్‌ఫ్రీ నంబర్ 15100 సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో న్యాయవాది తిరుపతయ్య, పారాలీగల్ వలంటీర్ రవి, దయాకర్, నవనీత్‌కుమార్, సాయికుమార్ పాల్గొన్నారు.