
ధాన్యం తరలింపులో జాప్యం చేయొద్దు
కొత్తకోట రూరల్: కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యా న్ని వేగంగా తరలించేందుకు అదనపు లారీలను అందుబాటులో ఉంచాలని అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులకు సూచించా రు. బుధవారం కొత్తకోట తహసీల్దార్ కార్యాలయంలో లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులతో అదనపు కలెక్ట ర్ సమావేశమై మాట్లాడారు. మిల్లులకు ధాన్యం తర లింపులో జాప్యం చేయొద్దన్నారు. వీలైనంత వేగంగా ధాన్యాన్ని తరలించేందుకు అదనంగా లారీలను ఏర్పా టు చేయాలన్నారు. కొత్తకోట మండలంలో 80శాతం పైగా ధాన్యాన్ని తరలించినట్లు చెప్పారు. అనంతరం పెద్దమందడి మండలం మోజర్ల శివారులోని రైస్‌మిల్లును అదనపు కలెక్టర్ పరిశీలించారు. మిల్లుకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే అన్‌లోడ్ చేసుకోవాలని సూ చించారు. ఆ తర్వాత పెద్దమందడి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి.. మండలంలో ఇంకా ఎంత ధాన్యం తరలించాల్సి ఉంది.. ఎన్ని లారీలు కావాల్సి ఉందనే వివరాలను అధికారులతో తెలుసుకున్నారు.