అంతా మా ఇష్టం! | - | Sakshi
Sakshi News home page

అంతా మా ఇష్టం!

May 22 2025 12:36 AM | Updated on May 22 2025 12:36 AM

అంతా

అంతా మా ఇష్టం!

నిబంధనలకు విరుద్ధంగా ధాన్యం కేటాయింపులు

వివరాలు 8లో u

డిక్లరేషన్‌ తీసుకున్నాం..

సాటెక్స్‌ యంత్రాలు లేని కొత్త మిల్లులకు ధాన్యం కేటాయించ లేదు. అయితే పాత మిల్లర్లతో రెండు, మూడు నెలల్లో ఏర్పాటు చేసుకుంటామని చెప్పడంతో.. వారితో డిక్లరేషన్‌ తీసుకుని ధాన్యం కేటాయించాం. పాత మిల్లుల్లో కొన్నింటిలో సాటెక్స్‌ యంత్రాలు లేని మాట వాస్తమే.. త్వరలో ఏర్పాటు చేయిస్తాం.

– కాశీవిశ్వనాథ్‌, డీఎస్‌ఓ

వనపర్తి: రైస్‌మిల్లులకు సీఎంఆర్‌ కేటాయింపుల్లో అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. తమకు నచ్చితే చాలు.. సీఎంఆర్‌ పెండింగ్‌లో ఉన్నా, మిల్లుల్లో సాటెక్స్‌, బ్లెండింగ్‌ యంత్రాలు లేకపోయినా ధాన్యం కేటాయింపులు చేస్తూ నిబంధనలకు తిలోదకాలిస్తున్నారు. సాటెక్స్‌ యంత్రాలు లేని మిల్లులకు ధాన్యం కేటాయింపులు చేయవద్దని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. ఇక్కడి అధికారులు సీఎంఆర్‌ నాణ్యతా విషయాన్ని గాలికి వదిలేసి.. తమ స్వలాభం కోసం నచ్చిన మిల్లర్లకు ధాన్యం కేటాయింపులు చేస్తున్నారు. బియ్యం అప్పగించే సమయంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకుంటే తమకేంటి నష్టం అన్నట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి.

బ్లెండింగ్‌ యంత్రాలు తప్పనిసరి..

కేంద్ర ప్రభుత్వం పేదలకు పౌష్టికాహారంతో కూడిన బియ్యం సరఫరా చేయాలనే సదుద్దేశంతో సీఎంఆర్‌ కోసం ధాన్యం కేటాయించిన మిల్లులకు పౌరసరఫరాల శాఖ నుంచి ఫోర్టిఫైడ్‌ రైస్‌ కర్నెల్స్‌ సరఫరా చేస్తోంది. వాటిని సమపాళ్లలో కలిపి మిల్లర్లు సీఎంఆర్‌ అప్పగించాల్సి ఉంటుంది. ఇందుకు ప్రత్యేకంగా బ్లెండింగ్‌ యంత్రాలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే నిర్దేశించిన మేరకు ప్రతి 50 కేజీల బస్తాకు అర కిలో పౌష్టికాహారం గల బియ్యం కలుపబడుతుంది. కానీ మిల్లర్లు చాలా మంది ఈ యంత్రాలను సైతం ఏర్పాటు చేసుకోలేదు. సదరు మిల్లర్లు పౌరసరఫరాలశాఖ అధికారులను ప్రసన్నం చేసుకుని ప్రజారోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

వనపర్తి మండలంలో సాటెక్స్‌

యంత్రాలు లేని మిల్లు

మిల్లులో ధాన్యాన్ని శుద్ధి చేసేందుకు, బియ్యం రంగు మారకుండా నాణ్యతగా మరాడించేందుకు సాటెక్స్‌ యంత్రాన్ని ప్రతి రైస్‌మిల్లులో తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని.. ఈ యంత్రం ఏర్పాటు చేసుకున్న మిల్లులకే సీఎంఆర్‌ కోసం ధాన్యం కేటాయింపులు చేయాలని స్పష్టమైన ఆదేశాలున్నాయి. బియ్యాన్ని స్క్రీనింగ్‌ చేయడంతో పాటు కలుషితాలను ఈ యంత్రం సమర్థవంతంగా తీసివేసి శుద్ధి చేస్తుంది. ఈ యంత్రంలోని సెన్సార్లు బియ్యం రంగు, సైజును స్పష్టంగా గుర్తించి.. రంగుమారిన బియ్యం గింజలతో పాటు సాధారణ బియ్యం గింజ కంటే తక్కువ సైజు (నూకలను) వేరు చేస్తుంది. చెడు గింజలను గుర్తించి వెంటనే ఎయిర్‌ ప్రెషర్‌తో వాటిని బయటకు నెట్టివేస్తుంది. సీఎంఆర్‌ అప్పగించే మిల్లుల్లో ఈ సాటెక్స్‌ మిషన్లు ఉంటేనే.. ప్రజాపంపిణీ వ్యవస్థకు నాణ్యమైన బియ్యం వస్తాయనే దృక్పథంతో రాష్ట్ర పౌరసరఫరాలశాఖ పై నిబంధనలను రూపొందిస్తే.. స్థానిక అధికారులు వారి స్వార్థం కోసం నిబంధనలకు నీళ్లు వదిలేస్తున్నారు.

సాటెక్స్‌ యంత్రంతో బియ్యం నాణ్యత..

జిల్లాలో 74 రైస్‌మిల్లుల ఎంపిక

సగానికి పైగా మిల్లుల్లో సాటెక్స్‌,

బ్లెండింగ్‌ యంత్రాలు కరువు

బియ్యం నాణ్యతపై తీవ్ర ప్రభావం

సగానికి పైగా మిల్లుల్లో..

సీఎంఆర్‌ కోసం ధాన్యం కేటాయించాలంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీటీలు, డీఎస్‌ఓ మిల్లులను పరిశీలించాలి. రాష్ట్ర పౌరసరఫరాలశాఖ రూపొందించిన నిబంధనల మేరకు మిల్లుల్లో సాటెక్స్‌, బ్లెండింగ్‌ యంత్రాలు ఉన్నాయా.. ధాన్యం స్టోరేజీ కోసం గోదాములు, తూకాలు వేసేందుకు వే బ్రిడ్జి, ఆధునిక యంత్రాల సామర్థ్యం తదితర వివరాలను పరిశీలించిన తర్వాత ధాన్యం కేటాయింపులకు అనుమతి ఇవ్వాల్సి ఉంది. కానీ ఇవేవీ లేకుండా స్థానిక పౌరసరఫరాలశాఖ అధికారులు అడ్డగోలుగా ధాన్యం కేటాయింపులు చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై టాస్క్‌ఫోర్స్‌ విచారణ చేపడితే.. చాలా విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

అంతా మా ఇష్టం! 1
1/1

అంతా మా ఇష్టం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement