
పరీక్ష జరగలేదు.
సీయూఈటీ పరీక్ష రా సేందుకు రాత్రి బయలుదేరి మద్దూరు నుంచి వచ్చాను. తీరా ఇక్కడికి వచ్చాక షార్ట్ సర్క్యూట్‌తో కంప్యూటర్లు పనిచేయలేదు. దీంతో పరీక్ష రాయకుండా వెనుదిరిగే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేయాలి.
– మహేశ్‌కుమార్, విద్యార్థి, మద్దూరు
వర్షంలో తడుచుకుంటూ వచ్చాం..
రాత్రి 2 గంటలకు గద్వాల నుంచి బయలుదేరి, ఉదయం 6 గంటలకు పరీక్ష కేంద్రానికి చేరుకున్నాం. షార్ట్ సర్క్యూట్‌తో పరీక్ష నిలిచిపోతే పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కరెంట్ పోతే మేమేం చేయాలని పేర్కొంటున్నారు. అలాంటప్పుడు పరీక్ష కేంద్రం ఎందుకు పెట్టుకోవాలి. వెంటనే ప్రభుత్వం, అధికారులు స్పందించి మా పిల్లలకు న్యాయం చేయాలి.
– సునీత, విద్యార్థిని తల్లి, గద్వాల
ఏపీ ఎంసెట్ వదులకున్నా..
పరీక్ష ప్రారంభమైన కొన్ని నిమిషాలకే విద్యు త్ సరఫరా నిలిచిపోయింది. గంటసేపు వర కు పునరుద్ధరించలేదు. అప్పటికే సమయం కూడా ముగిసింది. అనంతరం పరీక్ష నిర్వాహకులు వచ్చి పరీక్షకు మరోసారి ఎన్టీఏ వారు స మాచారం ఇస్తారు.. అప్పడు వచ్చి పరీక్ష రా యాలని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పరీక్షలు రాసి ఇక్కడ మాత్రం నిర్వహించలేదు. ఏపీ ఎంసెట్ వదులుకుని ఈ పరీక్షకు వచ్చాను. న్యాయం చేయాలి.
– సాయివర్షిణి, విద్యార్థి, మరికల్

పరీక్ష జరగలేదు.

పరీక్ష జరగలేదు.