అన్నివర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే | - | Sakshi
Sakshi News home page

అన్నివర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే

May 4 2025 6:31 AM | Updated on May 4 2025 6:31 AM

అన్ని

అన్నివర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే

కొత్తకోట రూరల్‌: రాష్ట్రంలోని అన్నివర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని పాతజంగమాయపల్లి–కనిమెట్ట మధ్య కొత్తగా నిర్మించిన వంతెనను, కనిమెట్టలో రూ.37 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను స్థానిక కాంగ్రెస్‌ నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారెంటీలను విడతల వారీగా అమలు చేస్తున్నామన్నారు. కొత్తగా తీసుకొచ్చిన భూ భారతి చట్టంతో ప్రతి రైతుకు మేలు చేకూరుతుందని.. ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు కలగకుండా అవసరం ఉన్నచోట కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు ధాన్యం విక్రయించిన 48 గంటల్లో రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నామని చెప్పారు. సన్నాలకు రూ.500 బోనస్‌ సైతం చెల్లిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీకి రోజురోజుకు పెరుగుతున్న ఆదరణ చూసి ప్రతిపక్షాలు ఓర్వలేక లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పల్లెపాగ ప్రశాంత్‌, కాంగ్రెస్‌పార్టీ సీనియర్‌ నాయకులు పి.కృష్ణారెడ్డి, బోయేజ్‌, శ్రీనివాస్‌రెడ్డి, మేస్త్రి శ్రీను, మాజీ సర్పంచ్‌ శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బీటీ రోడ్డు ప్రారంభం..

మదనాపురం: మండలంలోని లక్ష్మీపురం గ్రామం నుంచి నెల్విడితండా వరకు వేసిన బీటీ రహదారిని శనివారం ఎమ్మెల్యే జి మధుసూదన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యంతో పాటు తాగు, సాగునీరు ఇవ్వాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. కార్యక్రమంలో మార్కెట్‌ చైర్మన్‌ ప్రశాంత్‌, వైస్‌ చైర్మన్‌ తిరుపతిరెడ్డి, ఆయా గ్రామాల కాంగ్రెస్‌ కార్యకర్తలు పాల్గొన్నారు.

రామన్‌పాడుకు

నీటి సరఫరా నిలిపివేత

మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో నీటిమట్టం తగ్గింది. శనివారం జలాశయంలో సముద్ర మట్టానికి పైన 1,015 అడుగులు ఉన్నట్లు ఏఈ వరప్రసాద్‌ తెలిపారు. జూరాల ఎడమ, సమాంతర కాల్వలో నీటి సరఫరా లేదని.. జలాశయం నుంచి కుడి, ఎడమ కాల్వలకు 12 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని వివరించారు.

రేపటి నుంచి

డిగ్రీ కళాశాలలు బంద్‌

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని వివిధ డిగ్రీ కళాశాలలను సోమవారం నుంచి బంద్‌ చేస్తున్నట్లు ప్రైవేటు కళాశాలల యాజమాన్య సంఘం నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు పీయూలో వైస్‌చాన్స్‌లర్‌తో జరిగిన సమావేశం అనంతరం వారు మాట్లాడుతూ.. కొన్నేళ్లుగా ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తోందని, దీంతో కళాశాలల యాజమాన్యాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు. దీనికి తోడు పీయూ అధికారులు సైతం కళాశాలల అఫ్లియేషన్స్‌, ర్యాటిఫికేషన్‌ పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు. కనీసం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వచ్చే వరకు సమయం ఇవ్వాలన్నా పట్టించుకోవడం లేదన్నారు. దీంతో ఈ నెల 6న జరిగే డిగ్రీ పరీక్షలను సైతం నిర్వహించడం లేదని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు జహీర్‌అక్తర్‌, ఫణిప్రసాద్‌, సత్యనారాయణగౌడ్‌, రజనీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

వేరుశనగ క్వింటా రూ.6,169

గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్‌యార్డుకు శనివారం 218 క్వింటాళ్ల వేరుశనగ రాగా, గరిష్టం రూ.6169, కనిష్టం రూ. 2700, సరాసరి రూ. 5969 ధరలు పలికాయి. అలాగే, 60 క్వింటాళ్ల ఆముదాలు రాగా గరిష్టం రూ. 5839, కనిష్టం రూ. 5209, సరాసరి రూ. 57 59 ధరలు పలికాయి. 1980 క్వింటాళ్ల వరి (సో న) రాగా గరిష్టం రూ.2026, కనిష్టం రూ. 170 1, సరాసరి రూ.1729 ధరలు లభించాయి.

అన్నివర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే
1
1/1

అన్నివర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement