
మాట్లాడుతున్న ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి
పాన్‌గల్: రాష్ట్రంలో అమలవుతున్న రైతు సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి తెలిపారు. సోమవారం మండలంలోని శాగాపూర్‌లో రూ.21 లక్షలతో నిర్మించిన గ్రామపంచాయతీ కార్యాలయ భవనాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యమిస్తూ నిధులు కేటాయిస్తున్నారన్నారు. సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని.. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రతిపక్ష పార్టీల నేతలపై నమోదు చేస్తున్న కేసుల గురించి ప్రజలకు వివరించాలన్నారు. గ్రామంలో రూ.50 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించామని.. రహదారి విస్తరణ పనులు ప్రారంభిస్తామని గ్రామస్తులు సహకరించాలని కోరారు. గ్రామంలోని శివాలయం అభివృద్ధి, తిరుపతయ్య చెరువుకు మినీ లిఫ్ట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ మామిళ్లపల్లి శ్రీధర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కిషన్‌నాయక్, సర్పంచ్ మౌనికయాదవ్, ఎంపీటీసీ సుబ్బయ్యయాదవ్, బీఆర్‌ఎస్ మండలపార్టీ అధ్యక్షుడు రాముయాదవ్, పీఆర్ డీఈ చెన్నయ్య, ఏఈ సత్తయ్య, ఎంపీడీఓ నాగేశ్వర్‌రెడ్డి, ఎంపీఓ రఘురాములు, ఉప సర్పంచ్ లలిత, పంచాయతీ కార్యదర్శి మహేష్‌గౌడ్, బీఆర్‌ఎస్ నాయకులు తిరుపతయ్యయాదవ్, చంద్రయ్య, డా.తిరుపతయ్య, మల్లేష్‌యాదవ్ పాల్గొన్నారు.
● ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన రాయినిపల్లి సర్పంచ్ సుఖేందర్‌నాయుడు కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి తెలిపారు. గ్రామంలో సోమవారం నిర్వహించిన సంతాపసభలో ఆయన పాల్గొని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.
కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి