నానా ఇబ్బందులు పడ్డాం..

- - Sakshi

నేను ఏడు ఎకరాల్లో మిర్చి పంట వేశాను. అధిక వర్షాలతో ఎకరా మేర పూర్తిగా పంట కోల్పోయా. మిగ తా 6 ఎకరాల్లో మిర్చి ఏరి తే ఎకరాకు 12 క్వింటాళ్ల చొప్పున మొత్తం 70 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. లెక్కకు 30క్వింటాళ్ల వరకు రావాలి. ఎకరాకు కూలీలు, ఎరువులు, మందులు మొత్తం కలిపి రూ.1.50లక్షల ఖర్చు అయింది. ఆశించినస్థాయి లో రేటు వచ్చినా.. మార్కెట్‌ సౌకర్యం లేక నానా ఇబ్బందులు పడ్డాం. మార్కెట్‌ రేటుతో కొనుగో లు చేసేలా అలంపూర్‌ చౌరస్తా, గద్వాలలో మా ర్కెట్‌ సౌకర్యం కల్పించాలి. – మద్దిలేటి,

చెన్నిపాడు, మానవపాడు, జోగుళాంబ గద్వాల

మార్కెట్‌ ఉంటే కలిసొచ్చేది..

కరా మిర్చి సాగు చేస్తే రవాణా మినహా రూ.1,30,000 పెట్టుబడి అయింది. మొదటి కాపు నాలుగు క్వింటాళ్లు రాగా.. రాయచూర్‌ మార్కెట్‌కు తీసుకెళ్లాను. క్వింటాల్‌కు రూ.14వేలతో కొనుగోలు చేశారు. అక్కడ ధర తక్కువగా ఉండడంతో రెండో కాపులో వచ్చిన ఎనిమిది క్వింటాళ్ల మిర్చిని హైదరాబాద్‌ మార్కెట్‌కు తీసుకెళ్లా. క్వింటాల్‌కు ధర రూ.16వేలు పెట్టారు. మొత్తం 12 క్వింటాళ్లు అమ్మితే రవాణా, ఇతరత్రా ఖర్చులు పోనూ రూ.1.28 లక్షలే వచ్చాయి. పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు. స్థానికంగా మార్కెట్‌ సౌకర్యం ఉంటే కొంత కలిసి వచ్చేది. – జనార్దన్‌,

ఇబ్రహీంపట్నం, మరికల్‌, నారాయణపేట

మార్కెట్‌ లేకపోవడం ధరపై ప్రభావం చూపింది..

నేను ఐదు ఎకరాల్లో మిర్చి సాగు చేశాను. ఎకరాకు 15 నుంచి 18 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా.. తెగుళ్లతో ఎకరాకు 6 నుంచి 8 క్వింటాళ్లే వచ్చింది. ధర బాగా ఉండడంతో క్వింటాల్‌కు కనీసం రూ.20 వేలు వస్తుందని అనుకున్నా. జిల్లాలో మార్కెట్‌ సౌకర్యం లేకపోవడం ధరపై ప్రభావం చూపింది. మొదటి వారంలో ఓ వ్యాపారికి స్థానికంగా విక్రయిస్తే క్వింటాకు రూ.12 వేలే పెట్టాడు. పోనీ మంచి ధర వచ్చే వరకు నిల్వచేసుకుందామంటే కోల్డ్‌ స్టోరేజీల్లో అద్దెలు అధికంగా ఉన్నాయి. ఎన్నో ఏళ్లుగా జిల్లాలో మిర్చి మార్కెట్‌ ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. ప్రభుత్వం ఇప్పటికై నా పట్టించుకోవాలి.

– చిన్న బీసన్న, అమరవాయి, మల్దకల్‌

Read latest Wanaparthy News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top